విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ పాత్ర‌లో ఎవ‌రో తెలుసా : ఎన్నిక‌ల ముందు "యాత్ర" స్పెష‌ల్ : ప‌్ర‌భావం చూపేనా..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల ముందు ఏపిలో బ‌యోపిక్ లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ గా రెండు సినిమాలు.. వైయ‌స్ పై ఒక బ‌యోపిక్ ఏపిలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ క‌ధానాయ‌కుడు విడుద‌ల అయింది. మ‌రో సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఇక‌, వైయ‌స్ అభిమానుల కోసం..వైసిపి కార్య‌క‌ర్త‌ల కోసం సిద్దం అవుతు న్న యాత్ర సినిమా ఫిబ్ర‌వ‌ని 8న విడుద‌ల‌కు సిద్దం అవుతోంది. వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా లో ఇప్పుడు ఏ పాత్ర‌కు ఎవ‌రిని ఎంపిక చేసారో తెలిసిపోయింది. అయితే, జ‌గ‌న్ పాత్ర ఎవ‌రనేది ఆస‌క్తి క‌రం..

ఎన్నిక‌ల ముందు యాత్ర స్పెష‌ల్‌..

ఎన్నిక‌ల ముందు యాత్ర స్పెష‌ల్‌..

ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు క‌ధానాయకుడు వ‌చ్చింది. ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల ఆధారంగా ఆర్జీవి తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల కాక‌ముందే వివాదాలకు కార‌ణ‌మ‌వుతోంది. దీని పై ఇప్ప‌టికే టిడిపి శ్రేణులు ఆగ్ర‌హంతో ఉన్నారుద‌. ప‌ర‌స్ప‌రం కేసులు న‌మోదు చేసుకున్నారు. ఇక‌, ఎన్నిక‌ల ముందు క‌ధానాయ‌కుడు ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ ను మ‌రోసారి ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చి రాజ‌కీయంగానూ ఎంతో కొంత మైలేజ్ వ‌స్తుంద‌ని టిడిపి నేత‌లు అంచ‌నా వేసారు. ఇక‌, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా డామేజ్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు టిడిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది. దీంతో..ఇప్ప‌టికే ఈ సినిమా లోని పాట‌పై కోర్టు మెట్లు ఎక్కారు. ఇక‌, ఇదే స‌మ యంలో..టిడిపి ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి అయిన వైసిపి ప్ర‌చారం చేసుకొనే వైయ‌స్ పాల‌న‌ను గుర్తు చేస్తూ యాత్ర
సినిమా ఫిబ్ర‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కీల‌క పాత్ర‌లు..పాత్ర ధారులు

కీల‌క పాత్ర‌లు..పాత్ర ధారులు

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత చ‌రిత్ర పై తీస్తున్న ఈ యాత్ర సినిమా లో ప్ర‌ధాన‌మైన వైయ‌స్ఆర్ పాత్ర‌ను ప్ర‌ముఖ మ‌ళ‌యాళి న‌టుడు ముమ్మ‌ట్టి పోషిస్తున్నారు. మహి.వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాత‌లు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌, ట్రైలర్‌లతో ఆకట్టుకు న్నారు. తాజాగా వాయిస్‌ ఆఫ్‌ యాత్ర పేరుతో మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. హీరో మమ్ముట్టి ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భాష రాకపోయినా.. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. శివా మేక సమర్పణలో 70 ఎమ్ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్‌, సచిన్‌ ఖేడ్కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జ‌గ‌న్ పాత్ర లో ఎవ‌రంటే..

జ‌గ‌న్ పాత్ర లో ఎవ‌రంటే..

ఇక ఈ సినిమా చివ‌రిలో వైయ‌స్ 2009 ఎన్నిక‌ల విజ‌యం..ఆ త‌రువాత హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో ఆక‌స్మిక మృతి.. ఇడుపుల పాయ‌లో అంత్య‌క్రియ‌లు వంటివి దాదాపు 20 నిమిషాల సేపు చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. తండ్రి మ‌ర‌ణం తో కుటుంబం ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు..వార‌సుడిగా జ‌గ‌న్ ఎలా న‌డుచుకుందీ ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఇక‌, ఈ జ‌గ‌న్ పాత్ర పైనే ఆయ‌న అభిమానులు..వైసిపి కార్య‌క‌ర్త‌లు చాలా ఆస‌క్తిగా ఉన్నారు. అనేక మంది సినీ హీరోల పేర్లు ప్ర‌చారం లోకి వ‌చ్చాయి. అయితే, సినిమా కే హైలైట్ గా నిలిచేలా జ‌గ‌న్ పాత్ర‌ను నిజంగా జ‌గ‌నే పోషిస్తున్నారు. ఒక చిన్న పాత్ర కోసం జ‌గ‌న్ ను ఒప్పించి.. నిజ జీవిత పాత్రలోనే క‌నిపించేలా చిత్రీక‌రించారు. దీంతో.. సినిమా పై వైసిపి శ్రేణులు ఆస‌క్తిగా ఉన్నాయి. ఎన్నిక‌ల ముందు వైయ‌స్ జీవిత ఆధారిత సినిమా ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

English summary
YS Jagan acting in his father biopic Yatra in his reel role. Mummitti acting as YSR. On feb8th Yatra cinema coming on screen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X