విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ప్రభుత్వానికి కరకట్ట అక్రమ నిర్మాణాల విషయంలో కాస్త ఊరట ..గోకరాజు గంగరాజుకు షాక్

|
Google Oneindia TeluguNews

బీజేపీ నేత గోకరాజు గంగరాజు కు హైకోర్టు ధర్మాసనం షాక్ ఇచ్చింది. ఒక గోకరాజు గంగరాజు కే కాదు, కృష్ణానది కరకట్ట మీదుగా అక్రమ నిర్మాణాలు చేసిన ప్రతి ఒక్కరికి హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు షాకింగ్ అనే అనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని సీఆర్డీఏ పంపించిన నోటీసులను నిలిపివేయాలని, కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గోకరాజు గంగరాజు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక వీటిపై విచారించిన కోర్టు పలు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించడం తో పాటుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

మేం తాళపత్రాలు తీస్తే బయటపడేది మీ పాపాలే .. నోటికి తాళం వేసుకోండి... వార్నింగ్ ఇచ్చిన బుద్దామేం తాళపత్రాలు తీస్తే బయటపడేది మీ పాపాలే .. నోటికి తాళం వేసుకోండి... వార్నింగ్ ఇచ్చిన బుద్దా

కృష్ణా నది కరకట్ట నిర్మాణాల నోటీసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ వేసిన గోకరాజు గంగరాజు

కృష్ణా నది కరకట్ట నిర్మాణాల నోటీసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ వేసిన గోకరాజు గంగరాజు

ఏపీ సీఎం జగన్ అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో కృష్ణానది కరకట్ట పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది . ఉండవల్లిలో కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే కరకట్టపై నిర్మించిన గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కు సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక తన గెస్ట్ హౌస్ కు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపి గోకరాజు గంగరాజు కృష్ణానది భూమిని తాము ఆక్రమించలేదని తమ భూమినే కృష్ణా నది ఆక్రమించిందని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ప్రభుత్వ నోటీసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నోటీసుల అమలు నిలిపివెయ్యాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయతే కోర్టు మధ్యంతర ఆదేశాలను నిరాకరించింది. దీంతో ఏపీ సర్కార్ కు ఊరట లభిస్తే కరకట్ట అక్రమ నిర్మాణ యజమానులకు షాక్ తగిలింది.

అన్ని అనుమతులు ఉన్నాయని కూల్చివేత నోటీసులు ఆపాలని కోరిన పిటీషనర్

అన్ని అనుమతులు ఉన్నాయని కూల్చివేత నోటీసులు ఆపాలని కోరిన పిటీషనర్

సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులపై గోకరాజు గంగరాజు కోర్టును ఆశ్రయించారు. తన భవనం నిర్మించిన తర్వాతే నదికి వంద మీటర్ల లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న జీవో వచ్చిందని ,తాము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన తన పిటీషన్ లో కోర్టుకు విన్నమించారు . చట్ట ప్రకారమే నడుచుకున్నామని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతులు ఉన్నాయన్నారు. బిపిఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామని పేర్కొన్నారు . దీంతో గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రం వదిలి భవనం నిర్మించుకోమని పర్మిషన్ ఇచ్చినట్లుగా గోకరాజు తెలిపారు.

నోటీసుల అమలు నిలిపివేతపై హైకోర్టు నిర్ణయం .. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని నిరాకరణ

నోటీసుల అమలు నిలిపివేతపై హైకోర్టు నిర్ణయం .. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని నిరాకరణ

ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లోగా జవాబు చెప్పాలనీ, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ అధికారులు చెప్పినా వారికి సమాధానం ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారు. ఇక గోకరాజు గంగరాజు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇరువైపుల వాదనలు విన్నారు. అప్పుడెప్పుడో నిర్మాణాలు చేస్తే గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని, 2017 లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది అంతేకాదు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ ప్రకటన చేశారు. నిర్మాణాల కూల్చివేత కు సంబంధించి సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన నోటీసులు అమలును నిలిపివేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

English summary
CRDA officials have asked the court to respond to these illegal constructions within a week or so and take legal action. The High Court hearing the Gokaraju Gangaraju petition heard arguments on both sides. The High Court questioned the government's counsel as to why illegal constructions have not been demolished in the past and why the National Green Tribunal orders have not yet been implemented ..The counter has been ordered to be filed with full details and the hearing has been postponed to 29th of this month. The notices issued by the CRDA authorities regarding the demolition of the structures have not been rejected. The High Court refused to grant interim injunction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X