విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని మారిస్తే అక్కడే జగన్ పతనం ఆరంభం : సీపీఐ రామకృష్ణ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేడు తీవ్ర రూపం దాల్చాయి. . రాజధాని రైతుల పోరాటానికి ఇప్పటికే జనసేన, టీడీపీ , బీజేపీ నేతలు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా నేడు రాజధాని ప్రాంతంలో వామపక్ష పార్టీల నేతల బృందం పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రాజధాని అమరావతి తరలింపు నిర్ణయం విరమించుకోవాలని రైతుల పక్షాన ఏపీ సర్కార్ ను విజ్ఞప్తి చెయ్యనున్నారు.

వైసీపీ రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే..అలా అయితే ఈ రగడ దేనికి అంటున్న తెలుగు తమ్ముళ్ళువైసీపీ రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే..అలా అయితే ఈ రగడ దేనికి అంటున్న తెలుగు తమ్ముళ్ళు

 1953లోనే విజయవాడ రాజధానిగా ఉండాలన్న సీపీఐ

1953లోనే విజయవాడ రాజధానిగా ఉండాలన్న సీపీఐ

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనపై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.విపక్షాలన్నీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్‌లో పడ్డాయని మంత్రి కన్నబాబు అనడం సరికాదని పేర్కొన్నారు సీపీఐ నేత రామకృష్ణ . రాజధాని అమరావతి తరలింపు నిర్ణయం సరైనది కాదని మాట్లాడిన ఆయన 1953లోనే విజయవాడ రాజధానిగా ఉండాలని తమ నేతలు ప్రకటించారన్నారు. రాజధాని అమరావతి తరలింపు సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం అని ప్రకటించారు.

జగన్ మూడు రాజధానుల ప్రకటన ఎమ్మెల్యేలు గుడ్డిగా అంగీకరించారన్న రామకృష్ణ

జగన్ మూడు రాజధానుల ప్రకటన ఎమ్మెల్యేలు గుడ్డిగా అంగీకరించారన్న రామకృష్ణ

సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నీ తనకే తెలుసు అన్నట్లు‌ వ్యవహరిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. మూడు రాజధానులని జగన్ ప్రకటించినా ఎమ్మెల్యేలు గుడ్డిగా అంగీకరించటం దారుణం అన్నారు. సీఎం జగన్ రాజధాని అమరావతిని మారిస్తే ఆయన పతనం అక్కడే మొదలవుతుందని రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే జగన్‌ మోసం చేశాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం అని ఎందుకు చెప్పలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రాజధాని మార్పే జగన్ పతనానికి నాంది అన్న సీపీఐ నేత .. నేడు రాజధాని గ్రామాల పర్యటన

రాజధాని మార్పే జగన్ పతనానికి నాంది అన్న సీపీఐ నేత .. నేడు రాజధాని గ్రామాల పర్యటన

రాజధాని మారిస్తే జగన్‌ రాజకీయ పతనం ప్రారంభమైనట్టేనని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకొని తీరుతామని రామకృష్ణ ప్రకటించారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం 29 గ్రామాల ప్రజల ఆందోళన కాదని, ఐదు కోట్ల మంది ప్రజల ఆవేదన అని ఆయన తెలిపారు. నేడు వామపక్ష నేతలు రాజధాని రైతులకు బాసటగా రాజధానిలో పర్యటించి తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నారు.

English summary
In support of the capital farmers, the CPI state leaders will tour the capital villages. Leaders will talk to farmers and ask them to know the conditions of the current situation.CPI Ramakrishna has said that Jagan's political fall will begin if the capital is shifted. The government need to call for an all-party meeting and demanded that everyone's opinion should be taken. He said that this is not just a matter of the people of 29 villages but the invasion of five crore people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X