విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇంటిపేరు రివర్స్ ... రాజధాని మార్పుపై చింతమనేని షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి మార్చవద్దు అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది అమరావతి పరిరక్షణా సమితి. ఈ నేపధ్యంలో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. ఇక ఇదే సమయంలో నవ్యాంధ్ర రాజధాని మార్పు కోరుకుంటున్నవారిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక అమ్మ,అబ్బకి పుట్టినవాడు ఎవడైనా అమరావతి రాజధాని మార్పును కోరుకోడు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు .

చింతమనేని వర్సెస్ కొఠారి .. దేనికైనా రెడీ అంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లుచింతమనేని వర్సెస్ కొఠారి .. దేనికైనా రెడీ అంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లు

గద్దె దీక్షకు మద్దతుగా చింతమనేని .. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

గద్దె దీక్షకు మద్దతుగా చింతమనేని .. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

మంగళవారం నాడు విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న చింతమనేని సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజధాని అమరావతిని మార్చాల్సిన అవసరం లేదని ఇది కావాలని కక్షతో చేస్తున్న పని అని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని తరలింపు 29 గ్రామాల సమస్య కాదన్న చింతమనేని అది రాష్ట్ర సమస్య అని పేర్కొన్నారు .

జగన్ ఉన్మాది, అహంకారి, దుర్మార్గుడు అన్న చింతమనేని

జగన్ ఉన్మాది, అహంకారి, దుర్మార్గుడు అన్న చింతమనేని

అమరావతి నుంచి రాజధానిని మార్చడం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఇంటి పేరు రివర్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. జగన్ ఉన్మాది, అహంకారి, దుర్మార్గుడు అనే భావన ప్రజలలో నెలకొందని నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. . రానున్న రోజుల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చింతమనేని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

ఇక మరోపక్క రాజధాని ఆందోళనల నేపధ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునివ్వటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు . దీంతో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్భంధం చేస్తున్నారు. గుంటూరులో పొలిటికల్ జేఏసీ నేతలను ముందుగానే అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఇక టీడీపీ కీలక నేతలను సైతం తెల్లవారుజామునుంచే పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

English summary
Concerns persist in the AP that the capital of Amaravati should not be changed. The Amaravati Conservation Council today called for the blockade of national highways. It is in this context that the police have deployed everywhere. Meanwhile, Chintamaneni Prabhakar shocked by his comments on those seeking capital change. Ammavati, who was born to a mother and father, never change the capital he said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X