విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM YS Jagan Says Good News For Unemployed Youth || Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులలో నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను స్థాపించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నిరుద్యోగుల పాలిట వరంగా మారనుంది.

ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలతో జగన్ దూకుడు పెంచారా: అసాధ్యం అన్న మాట సుసాధ్యం చేస్తారా !!ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలతో జగన్ దూకుడు పెంచారా: అసాధ్యం అన్న మాట సుసాధ్యం చేస్తారా !!

స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం

స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలోనినిరుద్యోగులలో స్కిల్స్ మరింత పెంచాలని అందుకోసం ప్రభుత్వం వైపు నుండి కూడా కృషి ఉండాలని భావించారు. సీఎం జగన్ అమరావతిలోని సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు.

 శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

ఈ సమీక్షలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడానికి వారిలో సరైన స్కిల్స్ లేకపోవడం ఒక కారణంగా గుర్తించారు. అందుకే ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభిన్న రంగాల్లో నిరుద్యోగులు రాణించేందుకు కావలసిన చదువులు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు .

నైపుణ్యాభివృద్ధికి యూనివర్సిటీ ఏర్పాటు ..25 కాలేజీలు

నైపుణ్యాభివృద్ధికి యూనివర్సిటీ ఏర్పాటు ..25 కాలేజీలు

రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధికోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండాయూనివర్శిటీ కింద ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీని స్థాపించాలని జగన్ సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ పరిధిలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు స్థాపించాలని జగన్ సూచించారు. దీంతో ఏపీలో నిరుద్యోగులు, విద్యార్థులు చక్కటి స్కిల్స్ తో శిక్షణ పొంది ఉద్యోగావకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది.

పాఠ్యప్రణాళికలో మార్పులు చెయ్యాలని సూచన

పాఠ్యప్రణాళికలో మార్పులు చెయ్యాలని సూచన

ఇక అంతే కాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నిరుద్యోగులకు శిక్షణ ద్వారా అందించాలని, నైపుణ్యాభివృద్ధికోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ సూచించారు. ఇక ఈ బాధ్యతలను యూనివర్సిటీలో నిర్వర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ శాఖల్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి శిక్షణ కార్యక్రమాల పైన విడివిడిగా నిధులను వినియోగించాల్సిన అవసరం లేదన్నారు.

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లపై దృష్టి

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లపై దృష్టి

ఆర్థిక శాఖకు నిధుల వినియోగ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత లో స్కిల్ డెవలప్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు.చదువు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి లభించాలని అదే తమ ప్రభుత్వ అభిమతమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక నామమాత్రంగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజిల రూపురేఖలు మార్చాలని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్‌ జరగాలని ఆయన తెలిపారు.

 నెలరోజుల్లోగా కార్యాచరణకు ఆదేశం

నెలరోజుల్లోగా కార్యాచరణకు ఆదేశం

గ్రామ సచివాలయాల వారీగా స్థానికంగా వారి సేవలను పొందటానికి ఒక యాప్‌ను రూపొందించాలని,దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తాను చేసిన సూచనలను, ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని నెలరోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్‌ సౌకర్యం కల్పించాలని,అప్రెంటిస్‌ అయ్యాక కూడా ఇంకా శిక్షణ అవసరమనుకుంటే మళ్లీ నేర్పించాలని, ఆతర్వాతే పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy has made a key decision to improve the skills of the unemployed in Andhra Pradesh. CM Jagan good news for the unemployed in AP. AP CM decided to set up a university for skill development at the state level. Moreover, the decision to establish Skill Development Colleges will now be a boon for the unemployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X