విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మాటలకు చేతలకు పొంతన లేదు.. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్ళింది ... కన్నా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు . నిన్నటికి నిన్న రాం మాధవ్ వైసీపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని పేర్కొన్నారు. ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లైందని రాం మాధవ్ ఆరోపించారు. టీడీపీతో నష్టపోయిన ప్రజలకు మరో పార్టీతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రాం మాధవ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగావైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ .

ఏపీ సర్కార్ కు మరో షాక్ .. ప్రత్యేక హోదాకే కాదు పన్ను రాయితీలకు మొండిచెయ్యి చూపిన కేంద్రం ఏపీ సర్కార్ కు మరో షాక్ .. ప్రత్యేక హోదాకే కాదు పన్ను రాయితీలకు మొండిచెయ్యి చూపిన కేంద్రం

కాకినాడలో ఈరోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనే లేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు . ప్రభుత్వం అన్నాక కులాలు, మతాలకు అతీతంగా పాలన అందించాలని వ్యాఖ్యానించారు. కానీ జగన్ సర్కార్ అలా ప్రవర్తించటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

 Jagan telling something and doing something ..World Bank gone back on loan... kanna

అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు వెనక్కి పోవటంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గిందని కన్నా ఆరోపించారు. ఏపీ విభజన సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీలను ఐదేళ్లలోనే పూర్తిచేశామని కన్నా స్పష్టం చేశారు. కానీ ఏపీలో ప్రభుత్వ అపనితీరు బాగా లేదన్న కన్నా ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.

English summary
BJP's state unit president for Andhra Pradesh Kanna Lakshmi Narayana has made interesting comments on YS Jagan and YCP. Lakshminarayana spoke at a BJP membership registration event in Kakinada today. Andhra Pradesh Chief Minister Jagan telling something and doing something . The government said that the government should not be governed by caste and religion. But he believes that Jagan Sarkar is not behaving like that. They said they opposed the anti-people policies being taken by the AP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X