విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ ఆదేశాలు బేఖాతర్: జగన్‌తో చనువుగా..ఆప్యాయంగా రాపాక: సభలో ముచ్చట్లు.. !

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీకి చెందిన ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్.. మరోసారి చర్చనీయాంశమయ్యారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చనువుగా మాట్లాడుతూ కనిపించారు. చాలాసేపటి వరకు ఆయన వైఎస్ జగన్ పక్కనే కూర్చున్నారు. వారిద్దరి మధ్య చాలాసేపు ముచ్చట్లు కొనసాగాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఒకట్రెండుసార్లు.. రాపాక భుజాన్ని తట్టడం కనిపించింది.

ఏ గట్టునుంటాడో..రాపాక: కమలంతో కలవలేక సతమతం: జనసేన పీఏసీ అత్యవసర భేటీ ఏం చేస్తుందో..!ఏ గట్టునుంటాడో..రాపాక: కమలంతో కలవలేక సతమతం: జనసేన పీఏసీ అత్యవసర భేటీ ఏం చేస్తుందో..!

 పవన్ కల్యాణ్ ఆదేశాలు బేఖాతర్..

పవన్ కల్యాణ్ ఆదేశాలు బేఖాతర్..


అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై ఎలా స్పందించాలనే విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన జారీ అయిన కొద్ది సేపటికే రాపాక వరప్రసాద్.. వైఎస్ జగన్‌తో సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. ఫలితంగా- అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన వైఖరి, తాను అనుసరించే విధానం ఏమిటనేది రాపాక పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వానికి తెలియజేసినట్టయింది.

 బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ..

బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ..

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆరంభమైన తరువాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాపాకకు ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఏపీ వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి చట్టం-2020, అమరావతి మెట్రో అభివృద్ధి చట్టం-2020లకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కల్యాణ్.. రాపాక వరప్రసాద్‌ను ఆదేశించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని, దీనికి అనుగుణంగా నడచుకోవాలని సూచించారు.

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే..

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే..

ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే రాపాక వరప్రసాద్.. వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ కనిపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులైనా సరే..అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రిని కలుసుకోవడం, ఆయనకు వినతిపత్రాలను అందజేయడం సాధారణంగా చోటు చేసుకునే విషయమే. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

 బిల్లుకు అనుకూలంగా ఓటు ఖాయమే..?

బిల్లుకు అనుకూలంగా ఓటు ఖాయమే..?


ఇక్కడి స్థితిగతులు వేరు.. రాపాక ఇప్పుడున్న పరిస్థితులు వేరు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకోవడం, వైఎస్ జగన్‌ను చాలా సందర్భాల్లో పొగడ్తల్లో ముంచెత్తడం తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ఏ ఒక్క దాన్ని కూడా రాపాక వ్యతిరేకించట్లేదు.. పైగా వాటిని ఆయన స్వాగతిస్తున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో రాపాక.. వైఎస్ జగన్‌తో చనువుగా వ్యవహరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Jana Sena Party MLA Rapaka Varaprasad closely associate with Chief Minister YS Jagan Mohan Reddy in the Assembly special sessions of Andhra Pradesh. Hourly after Jana Sena Party President Pawan Kalyan writes letter to Rapaka Varaprasad for vote against the Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X