విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగంలోకి పవన్ కళ్యాణ్ : రాజధానిని తరలించవద్దు: అమరావతికి జనసేనాని..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని రగడ పైన జనసేన అధినేతప వన్ స్పందించారు. అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేసారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని రైతులు పవన్ తో పాటుగా బీజేపీ లో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితోనూ సమావేశమయ్యారు. ఆయన సైతం అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వరదలు వచ్చాయని రాజధాని మార్పు సరైనది కాదని..దీని పైన ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. వారు తీసుకొనే నిర్ణయాలకు ప్రధాని మోదీ..అమిత్ షా మద్దతు ఉందని విజయ సాయి రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు.

రాజధాని రైతులకు అండగా పవన్...

రాజధాని రైతులకు అండగా పవన్...

రాజదాని ప్రాంతానికి చెందిన రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను కలిసారు. రాజధాని తరలించకుండా చూడాలని కోరారు. వారితో మాట్లాడిన వపన్ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్ము తో రాజధాని నిర్మాణం చేస్తున్నారని..గత పాలకులు అందులో అవకతవకలకు పాల్పడి ఉంటే వాటిని సరి దిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో రాజధాని గురించి నిర్ణయం తీసుకొ ని అమలు చేస్తన్నప్పుడు..అభ్యంతరాలు ఉన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదు...రాష్ట్రమంతటిదని తెలిపారు. రాజధాని రైతుల ఆవేదనను అర్థం చేసుకున్నానని...వారికి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టం లేకపోయినా..తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుందని..ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన విషయం కాదని వ్యాఖ్యానించారు. రాజధాని సమస్యల పైన రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

అమరావతిలో రెండు రోజుల పర్యటన..

అమరావతిలో రెండు రోజుల పర్యటన..

రాజధాని కేవలం 29 గ్రామాల సమస్య మాత్రమే కాదని..ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని అక్కడే ఉండటం సబబని పవన్ పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు రాజధాని మార్చాలనేది సరైన నిర్ణయం కాదని.. ఖర్చు తో కూడుకున్నదని చెప్పుకొచ్యచారు. రైతులు పొలాలు సైతం త్యాగం చేసారంటే అది రాష్ట్రం కోసమేనని వివరించారు. రాజధాని లో పరిస్థితులను అధ్యయనం చేయటానికి.. రైతులకు సంఘీభావంగా ఈ నెల
30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని గ్రామాల్లోని రైతులను కలవనున్నారు. అలాగే అమరావతిలో నిలిచిపోయిన పనులను పరిశీలించనున్నారు. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు.

రాజధాని అంశం పైన ముఖ్యమంత్రి స్పందించాలి...

రాజధాని అంశం పైన ముఖ్యమంత్రి స్పందించాలి...

రాజధాని రైతులు ఈ మధ్య కాలంలో బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కలిసారు. రైతుల ఆవేదన విన్న సుజనా తాను రైతులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు ఉన్నాయని రాజధాని మార్చటం సరైన నిర్ణయం కాదన్నారు. ఇప్పటి వరకు రాజధాని వ్యవహారం పైన ముఖ్యమంత్రి స్పందించలేదని.. ముఖ్యమంత్రి జగన్ రాజధాని పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని...కేంద్రానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తాను ఎవరికీ బినామీ కాదని.. రాజధానిలో తనకు ఎక్కడా భూములు లేవని స్పష్టం చేసారు. విజయ సాయి రెడ్డి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రధాని మోదీ..అమిత్ షా మద్దతు ఉందని చెప్పటం అబద్దమన్నారు. ప్రభుత్వం తాము తీసుకుంటున్న నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఏ సమయంలో అయినా రైతులకు బీజేపీ అండగా నిలుస్తుంది సుజనా హామీ ఇచ్చారు.

English summary
Janasensa Chief Pawan Kalyan demanded to not move capital from Amaravati.He announced his support for local farmers and pawan goiong to visit capital on last day of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X