విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులకు బాసట: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటలు పరిశీలిస్తోన్న పవన్ కల్యాణ్..

|
Google Oneindia TeluguNews

నివర్ తుపాన్ బీభత్సంతో ఏపీలో భారీగా పంటలకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలిస్తున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నష్ట పరిహారం వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు ఉన్నారు.

గన్నవరం విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. కంకిపాడు మీదుగా కృష్ణా జిల్లా వెళ్లారు. పలు ప్రాంతాల్లో పంటలను పరిశీలిస్తున్నారు. పంటలకు సంబంధించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. పంటలు ఏ మేరకు నష్టపోయామనే అంశాన్ని రైతులు వివరిస్తున్నారు. అన్నీ పంటలకు పరిహారం ఇవ్వాలని.. రైతులను ఆదుకోవాలని కోరారు.

janasena chief pawan kalyan visits farm lands at krishna

అసలే కరోనా కాలం కాగా.. చేతికొచ్చిన పంటలు తుపాన్ బీభత్సంతో నష్టపోయారు. రైతులకు ధైర్యం కల్పించారు పవన్ కల్యాణ్. అన్నీ పంటలు వేసిన రైతులను ఆపన్నహస్తం అందించాలని చెప్పారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలిలో పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఇటు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా.. పవన్ కల్యాణ్ పర్యటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కృష్ణా జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్‌ను చూడడానికి స్థానిక జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

English summary
janasena chief pawan kalyan visits farm lands at krishna district today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X