విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ర‌విప్ర‌కాశ్‌కు నేనున్నా.. కేఏ పాల్‌: ఆయ‌న్ని త‌ప్పిస్తే ఖ‌బ‌డ్దార్ : నా వంతు ప్ర‌య‌త్నం చేస్తా..!

|
Google Oneindia TeluguNews

సంచ‌ల‌నంగా మారిన ర‌వి ప్ర‌కాశ్ కేసులో మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించటానికి ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ముందుకొచ్చారు. ర‌వి ప్ర‌కాశ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న్న త‌న ప‌ద‌వి నుండి త‌ప్పించ‌టానికి ప్ర‌య‌త్నిస్తే ఖ‌బ‌డ్దార్ అని హెచ్చ‌రించారు. గొడ‌వ‌లు ఉంటే ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియాకు ధన్యవాదాలు .. నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేరు .. రవి ప్రకాష్ తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియాకు ధన్యవాదాలు .. నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేరు .. రవి ప్రకాష్

ర‌విప్ర‌కాశ్‌కు మ‌ద్ద‌తుగా..

ర‌విప్ర‌కాశ్‌కు మ‌ద్ద‌తుగా..

టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతుగా నిలిచారు. ఈ మేర‌కు ఆమ‌న ఓ వీడియో పోస్టు విడుద‌ల చేసారు. అందులో ఆయ‌న త‌న అభిప్రాయం స్ప‌ష్టం చేసారు. త‌న‌కు 2007 నుండి త‌నకు తెలుస‌ని చెప్పుకొచ్చారు. సీఈవో ప‌ద‌వి నుండి ఆయ‌న్ని త‌ప్పించార‌నే వార్తలు త‌న‌కు షాక్ ఇచ్చాయ‌న్నారు. ఆయ‌న పైన ఒత్తిడి చేసి సీఈవో ప‌ద‌వి నుండి తీసేయాల‌ని చూస్తే ఖ‌బ‌డ్దార్ అని హెచ్చ‌రించారు. ర‌వి ప్ర‌కాశ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తానంటూ ఆ వీడీయోలో స్ప‌ష్టం చేసారు. అంద‌రం క‌లిసి ఉండాల‌ని..ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌ని వివ‌రించారు. ఇక‌, ఆ ఛాన‌ల్ యాజ‌మ‌న్యానికి..ర‌వి ప్ర‌కాశ్ మ‌ధ్య ఏవైనా గొడ‌వ‌లు ఉంటే వాటిని ప‌రిష్క‌రించేందుకు అవ‌స‌ర‌మైతే తాను మ‌ధ్య‌వ‌ర్తిగా ప్ర‌య‌త్నం చేస్తానని వెల్ల‌డించారు.

ఫోర్జ‌రీ కేసులో నోటీసులు

ఫోర్జ‌రీ కేసులో నోటీసులు

టీవీ9 సంస్థ యాజ‌మాన్య బ‌దిలీ వ్య‌వ‌హారం వివాదంగా మారింది. కొత్త యాజ‌మాన్యం టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్ర‌కాశ్ పైన వేటు వేసింది. కొత్త సీఈవో నియామ‌కం కోసం బోర్డు స‌మావేవ‌మైంది. అయితే, ఈ వివాదం కొన‌సాగుత‌న్న స‌మ‌యంలోనే టీవీ తెర మీద ద‌ర్శ‌న‌మిచ్చిన రవి ప్ర‌కాశ్ తాను ప‌రారీలో లేన‌ని చెప్పుకొచ్చారు. తాను టీవీ9 సీఈవో గానే మాట్లాడుతున్నాన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ రోజు త‌మ ముందు హాజ‌రు కావాల‌ని సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వారు పోలీసులు ముందు హాజ‌రువుతారా లేదా అనే ఆస‌క్తి నెల‌కొని ఉంది. అయితే, ఇత‌ర ఛాన‌ళ్లు త‌న గురించి చేస్తున్న ప్ర‌చారానికి ర‌వి ప్ర‌కాశ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చిన్న పాటి వివాదం పైన న్యాయ పోరాటం జ‌రుగుతున్నద‌ని చెప్పుకొచ్చారు. ఈ స‌మ‌యంలో పోలీసులు ఇచ్చిన నోటీసుల పైన ఏ ర‌కంగా స్పందిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ఇక ఈ వ్య‌వ‌హారం నిన్న‌టి నుండి మీడియాతో పాటుగా సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది. ర‌వి ప్ర‌కాశ్ పైన ఫోర్జ‌రీ కేసు న‌మోదైంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కొంద‌రు ర‌వి ప్ర‌కాశ్‌కు మ‌ద్ద‌తు ప్ర‌కిటిస్తుంటే మ‌రి కొంద‌రు ర‌వి ప్ర‌కాశం పైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఏపీ-తెలంగాణాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ర‌వి ప్ర‌కాశ్ త‌న పైన వ‌చ్చిన అభియోగాల విష‌యంలో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు..కొత్త మేనేజ్‌మెంట్.. పోలీసులు ఏ ర‌కంగా ముందుకు వెళ్తార‌నే ఆస‌క్తి నెలకొని ఉంది.

English summary
Prajasanthi party chief supported Ravi Prakash. Paul assured support for Ravi Prakash at any stage. If any body try to remoe him as CEO he will not sit calm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X