విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణ

|
Google Oneindia TeluguNews

రాష్ట్రం అభివృద్ది చెందాలంటే... అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని.. కాని పరిపాలన వికేంద్రీకరణ సరికాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే.. సర్ధుకుంటున్నారని వారు మళ్లి విశాఖ వెళ్లడం సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాజధానిలో పార్టీ బృందం పర్యటిస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు రావొచ్చంటూ శాసనసభలో సీఎం జగన్ చేసిన ప్రకటన సీఎం జగన్‌మోహన్ రెడ్డి అనుభవరాహిత్యానికి నిదర్శనమని అన్నారు.

అమరావతిపై చంద్రబాబు అవినీతిని బయటపెడతాం... ఆర్ధిక మంత్రి అమరావతిపై చంద్రబాబు అవినీతిని బయటపెడతాం... ఆర్ధిక మంత్రి

రాష్ట్ర రాజధానిపై సీఎం చేసిన ప్రకటనతో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది బీజేపీ నేతలు స్వాగతిగిస్తుండగా మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ రాజధానికి శంకుస్థాపన చేయడం, రాజధాని ప్రాంతానికి రైతులు వేల ఎకరాలు ఇవ్వడంతో అటు పార్టీతో పాటు రైతులు కూడ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడ సీఎం నిర్ణయంపై అచితూచి మాట్లాడుతున్నారు.

kanna laxminarayana opposed of capital change

రాజధానులు ఏర్పాటు కావచ్చు అంటూ సీఎం జగన్ చెప్పారు కాని, పూర్తిగా మూడు రాజధానులు వస్తాయని చెప్పలేదంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మరోవారంలో రాజధానిపై నివేదిక రానున్న నేపథ్యంలోనే సీఎం ప్రకటనపై టీడీపీ, బీజేపీతో పాటు జనసేన పార్టీలు వ్వతిరేకిస్తూ... పలు విమర్శలు చేస్తున్నాయి.

English summary
ap state bjp president kanna laxminarayana opposed the cm jagn statement of capital change in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X