విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనగరాజ్ విజయసాయిని కలిస్తే లేనిది.. నిమ్మగడ్డ సుజనాను కలిస్తే తప్పా : కేశినేని నానీ ప్రశ్నలివే !!

|
Google Oneindia TeluguNews

ఏపీలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లతో భేటీ అయిన విషయంపై స్పందించిన నాని బీజేపీ నేతలతో నిమ్మగడ్డ కలవటంలో తప్పేమీ లేదని సమర్ధించారు .ఇక ఈ క్రమంలో వైసీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు.

ఇంతకీ నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా గుర్తించారా ? నన్ను కలిస్తే భయమెందుకు ... సుజనా లాజిక్స్ఇంతకీ నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా గుర్తించారా ? నన్ను కలిస్తే భయమెందుకు ... సుజనా లాజిక్స్

మీకో నీతి ఇతరులకు ఓ నీతా ? ప్రశ్నించిన కేశినేని నానీ

మీకో నీతి ఇతరులకు ఓ నీతా ? ప్రశ్నించిన కేశినేని నానీ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆర్డినెన్స్ జారీచేసి తొలగించిన తర్వాత ఆయన స్థానంలో నియమించిన దళిత ఎన్నికల కమిషనర్ కనగరాజ్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు ఎస్ఈసీ గా ఉన్నారా లేదా ?అని వైసీపీ ప్రభుత్వాన్ని స్పష్టం చేయాల్సిందిగా కేశినేని నాని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులకు ఒక నీతి,మిగతా వారికి ఇంకొక నీతా అంటూ కేశినేని నాని ఏపీ అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనగరాజ్ వైసీపీ ఎంపీని కలిస్తే తప్పు లేదా ?

కనగరాజ్ వైసీపీ ఎంపీని కలిస్తే తప్పు లేదా ?

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించిన కనగరాజ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిస్తే తప్పు లేదు కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లను కలిస్తే తప్పా అని కేశినేని నాని సూటిగా ప్రశ్నించారు. ఇక ఈ వ్యాఖ్యతో ఈ వ్యవహారంలో కొత్త విషయాన్ని గుర్తు చేశారు కేశినేని నానీ . అంతేకాదు ఒకపక్క బీజేపీ నేతలు సైతం అవకాశం దొరికితే టీడీపీ అధినేత చంద్రబాబు మీద విరుచుకు పడుతుంటే బీజేపీ నేతలకు మద్దతుగా మాట్లాడారు టీడీపీ ఎంపీ కేశినేని నానీ

పార్క్ హయత్ హోటల్ పబ్లిక్ ప్లేస్ .. ఇంకా సీక్రెట్ ఏముంది !!

పార్క్ హయత్ హోటల్ పబ్లిక్ ప్లేస్ .. ఇంకా సీక్రెట్ ఏముంది !!

మీకొక న్యాయం,ఇతరులకి ఇంకొక న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు కలిసి మాట్లాడడాన్నిరహస్య భేటీ అంటున్నారని అది తప్పని పేర్కొన్నారు కేశినేని నాని. సుజనా చౌదరి తన కార్యాలయాన్ని జూబ్లీహిల్స్ నుంచి పార్క్ హయత్ హోటల్ కు మార్చుకున్నారని,పార్క్ హయత్ హోటల్ పబ్లిక్ ప్లేస్ కానీ, ప్రైవేట్ ప్లేస్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు.

ఎస్ఈసి గా ఉన్నారో లేదో మీరే చెప్పాలి ?

ఎస్ఈసి గా ఉన్నారో లేదో మీరే చెప్పాలి ?

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజాస్వామ్య వద్ద పోస్టులో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, బిజెపి నేతలను కలవడంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు అని పేర్కొన్న కేశినేని నాని ఇంతకీ ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. కొందరు వైసీపీ నేతలు,మంత్రులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగబద్ధ పోస్టులో కొనసాగుతున్నారని వ్యాఖ్యలు చేస్తుండగా, మరోవైపు ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవి నుంచి తొలగించామని కూడా చెబుతున్నారని కేశినేని నాని పేర్కొన్నారు.

Recommended Video

Rajya Sabha Elections 2020 : AP 4 Rajya Sabha Seats Won By YSRCP
క్లారిటీ ఇవ్వాల్సింది వైసీపీ ప్రభుత్వమే !!

క్లారిటీ ఇవ్వాల్సింది వైసీపీ ప్రభుత్వమే !!

క్లారిటీ ఇవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైసిపి ప్రభుత్వమేనని కేశినేని నాని తేల్చిచెప్పారు. ఇక ఈ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే టీడీపీని వదిలి బీజేపీలో చేరిన సుజనా చౌదరిని ,అలాగే బిజెపి నేత కామినేని శ్రీనివాస్ ను, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవడాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని సమర్థించారు. ఇక వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని తప్పేంటి అంటూ నిలదీశారు.

English summary
TDP MP Keshineni Nani Supported bjp mp Saujana chowdary about park Hyatt hotel meeting issue. Dalit Election Commissioner Kanagaraj, met with ycp mp vijayasai reddy is not a fault but nimmagadda rameshkumar met with sujana chowdary is a fault ? questioned .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X