tdp request support municipal elections tdp leaders atchannaidu keshineni nani buddha venkanna bonda uma chandrababu AP Municipal Elections 2021 AP Local Body Elections 2021 టీడీపీ మద్దతు టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు కేశినేని నాని బోండా ఉమా చంద్రబాబు politics
బెజవాడ నేతల బుజ్జగింపు పర్వం .. నేరుగా అసంతృప్త నేతల ఇళ్ళకు వెళ్ళి మద్దతు కోరిన కేశినేని శ్వేత
బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీకి చేటు చేస్తున్నాయని భావించిన టిడిపి అధినేత చంద్రబాబు, బెజవాడలో రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్ల పంచాయతీలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా మేయర్ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత అసంతృప్తులను బుజ్జగించడానికి స్వయంగా వారి ఇంటికి వెళ్లారు.
టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని... చంద్రబాబు చెప్తే ఆ పని చేస్తా అని సంచలన ప్రకటన

బోండా ఉమా ఇంటికి వెళ్ళిన కేశినేని శ్వేత .. కలిసి పని చేద్దామని విజ్ఞప్తి
బోండా ఉమా ఇంటికి వెళ్ళిన శ్వేత ఆయనతో చర్చించారు. శ్వేతతో పాటు విజయవాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం కూడా బోండా ఉమ ఇంటికి వెళ్లారు. ఎలాంటి విభేదాలు లేకుండా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా తనకు సహకరించాలని కేశినేని శ్వేత బోండా ఉమకు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆమె బోండా ఉమను కోరారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల మద్దతును కోరిన శ్వేత వారిని కూడా కలిసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కలిసి పని చేద్దామని విజ్ఞప్తి చేశారు.

అసంతృప్త నేతలను కలిసి మాట్లాడుతున్న మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత
కేశినేని శ్వేత స్వయంగా నేరుగా తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న, కేశినేని నాని పై భగ్గుమంటున్న అసంతృప్త నేతలను కలవడంతో ఈ ముగ్గురు నేతలు కేశినేని శ్వేతకు సహకరిస్తారు అన్న అభిప్రాయం టిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది. వారిని బుజ్జగించే యత్నం చేస్తున్న టీడీపీ ముఖ్య నేతలు సైతం కలిసి పని చెయ్యాలని సూచిస్తున్నారు. విజయవాడలో రేపు జరగనున్న చంద్రబాబు టూర్ రూట్ మ్యాప్ మార్పు విషయంలో కూడా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు . అయితే రూట్ మ్యాప్ తాను మార్చలేదని కేశినేని నానీ స్పష్టం చేశారు .

అసంతృప్త నేతల మధ్య సయోధ్య యత్నాలు .. ఏ మేరకు ఫలిస్తాయో ?
తెలుగుదేశం పార్టీ నేత లైన బోండా ఉమా, బుద్దా వెంకన్న , నాగుల్ మీరాలకు, కేశినేని నానికి మధ్య అభ్యర్థుల ఎంపికలోనూ, మేయర్ అభ్యర్థిత్వంపై వచ్చిన విభేదాలు చిలికిచిలికి గాలివానగా మారి బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి జరుగుతున్న తాజా ప్రయత్నాలు ఈ ఎన్నికలలో ఏ మేరకు టిడిపికి లాభిస్తాయో వేచి చూడాలి.
అసలు రేపు చంద్రబాబు పర్యటనను ఈ నేతలు సక్సెస్ చేస్తారా ? బాబు టూర్ లో పాల్గొంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది .