విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శృతిహాస‌న్ ను వ‌దల్లేదు : మ‌హేష్ బాబు మిన‌హా : విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్ది పీవీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు .

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌ల ప్రచారం కొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలు..పార్టీ అధ్యక్షులు..అభ్య‌ర్దుల మ‌ధ్యే ఆరోప‌ణ‌ల తో సాగుతున్న ఏపి ఎన్నిక‌ల ప్ర‌చారంలో స‌డ‌న్ గా ఏ ప్ర‌ముఖ హీరోయిన్ పేరు వినిపించింది. శృతిహాస‌న్ ను ఆయ‌న బ్లాక్ మెయిల్ చేసార‌ని..వ‌ద‌ల్లేద‌ని ఆరోపించారు. ఇప్పుడు విజ‌య‌వాడ కేంద్రంగా సాగుతున్న ఈ ప్ర‌చారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొత్త టర్న్ తీసుకుంది.

జేసి ఇలాకాలోకి జ‌గ‌న్‌: నేడు తాడిప‌త్రిలో ప్ర‌చార స‌భ : వైసిపి లోకి జేసి కీల‌క అనుచ‌రులు...!జేసి ఇలాకాలోకి జ‌గ‌న్‌: నేడు తాడిప‌త్రిలో ప్ర‌చార స‌భ : వైసిపి లోకి జేసి కీల‌క అనుచ‌రులు...!

శృతి హాస‌న్ ను బ్లాక్ మెయిల్ చేసారు..

కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్‌ను వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ(పొట్లూరి వర ప్రసాద్) బ్లాక్ మెయిల్ చేశారని టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కాల్ షీట్లు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఏడిపించిన వ్యక్తి పివిపి అంటూ ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీలో మహేశ్‌బాబును తప్ప ప్రతి హీరో నూ ఇతను మోసం చేశాడని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.

Kesineni Nani sensational Comments on PVP : He did not leave Sruthi hassan..

సినిమా ఇండస్ట్రీకి కూడా ఇత నంటే అసహ్యం పుట్టిందిని.. ఒక్క మహేశ్ బాబే ఈయన చేతికి దొరకలేదని విమ‌ర్శించారు.. హీరోయిన్లను ఏడిపిం చా డు.. డైరెక్టర్లను ఏడిపించాడు.. అవసరం అయితే లీగల్ నోటీసులని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల డేట్లు తీసుకునే వాడని దుయ్య‌బ‌ట్టారు. పివిపి ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడని... ఒక క్రిమినల్.. ఇతనొక మోసగాడు.. అంటూ కేశినేని నాని ఆరోపించారు.

ఆయ‌న ఆర్దిక నేర‌గాడు.
విజ‌య‌వాడ వైసిపి ఎంపి అభ్య‌ర్ది పీవీవీ ఆర్థికనేరగాడంటూ కేశినేని విమర్శించారు. పీవీపీ నాకంటే ఐదేళ్లు చిన్నోడు... చిన్నప్పటి నుంచి ఇతనో నేరగాడని ఆరోపించారు అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లను ప్రజలు విజయవాడలో అడుగు పెట్టనివ్వరన్నారు. హైదరాబాద్‌లో పివిపి సీన్ అయిపోయిందన్నారు. కెనరాబ్యాంక్‌కు ఇతను రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్న నోటీసులు ఇచ్చారని... ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేలం వేస్తే ఏడు కోట్లు కూడా రాలేదని వివ‌రించారు. మిగతా 130 కోట్లు ఎవరు కడతారని ప్ర‌శ్నించారు. అలాగే ఇంకా చాలా స్కాములు చేశాడని విమ‌ర్శించారు . బొగ్గు స్కాము, జగతి పబ్లికేషన్స్‌లో రూ. 147 కోట్ల మనీల్యాండరింగ్, హవాలా కేసులు, అలాగే సెబీ కూడా రూ. 30 కోట్ల ఫైన్ వేసిందని కేశినేని నాని ఆరోపణలు గుప్పించారు.

English summary
Vijayawada TDP Mp Candidate Kesineni Nani serious alligations on YCP MP candidate PVP. He says PVP is Financial criminal he mislead many banks and also cine famous personalities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X