విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బేషరతు కాదు..కండీషన్లతోనే: బీజేపీ..జనసేన మధ్య ఒప్పందాలు ఇవే: ఆ తరువాతే పొత్తు ఖరారు..!

|
Google Oneindia TeluguNews

బీజేపీ..జనసేన మధ్య పొత్తు నిర్ణయం ఒక్క పర్యటనతో..ఒక్క రోజుతోనే జరిగింది కాదు. దాదాపు రెండు నెలల కాలంగా రెండు పార్టీల ప్రతినిధుల మధ్య మంతనాలు సాగుతున్నాయి. అమెరికాలో జరిగిన తానా సభల సమయంలో ఈ పొత్తు వ్యవహారానికి బీజం పడింది. బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ ఆ సమయంలోనే పవన్ తో రెండు పార్టీల మధ్య సంబంధాల పైన చర్చలు జరిపారు. అయితే, ఆ సమయంలో పార్టీ విలీనం గురించి ప్రతిపాదన రాగా..అందుకు పవన్ కళ్యాణ్ ససేమిరా అన్నారు. దీంతో..పొత్తు దిశగా చర్చలు ఆరంభమయ్యాయి. కర్నాటకకు చెందిన ఇద్దరు యువ ఎంపీలు..ఆరెస్సెస్ ప్రముఖల సైతం ఇందు లో కీలక భూమిక పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో నడ్డా సమక్షంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగింది. కానీ, ఇదే సమయంలో రెండు పార్టీలు భే షరతుగా పొత్తు పెట్టుకున్నామని చెప్పినా..అంతర్గతం గా మాత్రం బీజేపీ కొన్ని అంశాలను పవన్ కు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో జనసేన సైతం కొన్ని అంశాల మీద క్లారిటీ కోరింది. ఆ తరువాత రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

జగన్ కు కష్టాలే..చంద్రబాబు అంచనాలివే: జనసేన..బీజేపీ పొత్తుపై: పార్టీ నేతలకు దిశా నిర్దేశం..!జగన్ కు కష్టాలే..చంద్రబాబు అంచనాలివే: జనసేన..బీజేపీ పొత్తుపై: పార్టీ నేతలకు దిశా నిర్దేశం..!

టీడీపీతో సంబంధం ఉండకూడదు..
విజయవాడలో ఒక హోటల్ లో పొత్తు అంశం పైన చర్చించేందకు జనసేన..బీజేపీ పార్టీల నేతలు సమావేవమయ్యారు. ఆ సమయంలో ఢిల్లీ నుండి బీజేపీ హైకమాండ్ ప్రతినిధిగా హాజరైన పార్టీ రాష్ట్ర వ్యవహారా ల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ రెండు పార్టీల పొత్తు..భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ఆ సమయంలోనే ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేసారు. బీజేపీ భవిష్యత్ లో టీడీపీతో కలవదని..అదే విధంగా జనసేన కూడా టీడీపీ..వామపక్షాలతో కలవకూడదని స్పష్టం చేసారు. దీంతో..ఆయన బీజేపీకి ఏపీలో ఏ పార్టీతో తెర ముందు..వెనుక ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తానని హామీ ఇచ్చారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామని..జనసేన సైతం దానికే కట్టుబడి ఉండాలని సూచించారు. దీనికి పవన్ సైతం అంగీకరించారు. అదే సమయంలో జనసేన నుండి ఏదైనా చెప్పాలనుకుంటే స్పష్టంగా చెప్పాలని సునీల్ దేవధర్ సూచించారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా ఉందని చెప్పుకొచ్చారు.

Key agreements made before alliance meet between BJP and janasena

పవన్ కళ్యాణ్ డిమాండ్ ఇదే..
ఈ చర్చల సమయంలో జనసేన అధినేత పవన్ సైతం తన మనసులోని మాటను బీజేపీ నేతల మధ్య స్పష్టంగా చెప్పారు. జనసేనను టీడీపీకి తొత్తు పార్టీ అంటున్న వైసీపీతో బీజేపీకి తెర వెనుక ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. దీంతో..ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలు ఏపీలో పొత్తులు..భవిష్యత్ వ్యూహాల పైన ఎటువంటి అంచనాలతో ఉన్నదీ వివరించారు. తాము జనసేనతో పొత్తు పెట్టుకొనే సమయంలోనే..ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతామని హామీ ఇచ్చారు. ఇక, పొత్తు చర్చలు ముగిసిన తరువాత సునీల్ దేవధర్ మీడియా సమక్షంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. తమకు ఏపీలో ఏ పార్టీతోనూ తెర ముందు..వెనుకా ఎటువంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చేసారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ సైతం టీడీపీ రాజధాని రైతులను మోసం చేసిందని ఆరోపిస్తూ..వామపక్షాలకు తాను బాకీ లేనని వ్యాఖ్యానించారు. తాను తొలుత బీజేపీతోనే ఉన్నానని..ఆ తరువాతనే వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నానని గుర్తు చేసారు. ఇప్పుడు ఈ ఒప్పందాల నడుమ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడింది.

English summary
Key agreements made before alliance meet between BJP and janasena in AP Politics. pawan Kalyan and BJP state incharge agreed each other on thier conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X