విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘జగన్ అంత భయమెందుకు?.. టీడీపీని ఓడించి అధికారం కట్టబెట్టింది ఇందుకేనా? ’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమరావతి రైతుల దీనావస్థను పార్లమెంటులో వివరించామని టీడీపీ ఎంపీలు కింజారపు అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని మండిపడ్డారు.

టీడీపీని ఓడించి అధికారమిస్తే..

టీడీపీని ఓడించి అధికారమిస్తే..

2019లో ప్రత్యేక హోదాను పోరాడి తెస్తారనే రాష్ట్ర ప్రజలు టీడీపీని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టారని రామ్మోహన్నాయుడు అన్నారు. 22 మంది ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడటం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని రామ్మోహన్నాయుడు చురకలంటించారు. హోదాపై ఇచ్చిన హామీ ఏమైందని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంటూ జగన్ రాష్ట్రమంతా తిరిగి యువతకు చెప్పారని.. ఇప్పుడేమో ఆ పదాన్ని కూడా పలకడం లేదని మండిపడ్డారు.

మూడు రాజధానులు అందుకేనా?

మూడు రాజధానులు అందుకేనా?


హోదా కోసం పోరాటం చేయాల్సిన సమయంలో వైసీపీ ఎంపీలు ఎక్కడ ఉన్నారని రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. 25 ఎంపీలు గెలిపిస్తే హోదా తెస్తామన్న జగన్.. ఇప్పుడు హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చేందుకు మూడు రాజధానులంటున్నారని ధ్వజమెత్తారు. హోదాను మర్చిపోవడానికే మూడు రాజధానులను తెచ్చారని ఆరోపించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలమే కేంద్రానికి అమరావతి పరిస్థితులను వివరించామని రామ్మోహన్నాయుడు తెలిపారు. రైతులు నిద్రాహారాలు మాని పోరాడుతుంటే సీఎం జగన్ స్పందించడం లేదని మండిపడ్డారు. పార్లమెంటులోనే రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిందని.. రాజధాని విషయంలో కేంద్రం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

మా మీదా.. వైసీపీ ఎంపీల వీరప్రతాపం..

మా మీదా.. వైసీపీ ఎంపీల వీరప్రతాపం..

తాము ఏపీ రైతుల కోసం పోరాటం చేస్తుంటే.. వైసీపీ ఎంపీలు తమపై వీరప్రతాపాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు తమ వీరప్రతాపాన్ని బీజేపీ మీద, కేంద్రం మీద చూపాలని సూచించారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు రాబట్టగలిగారు.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, రాజధాని, రాజధానులకు ఏ మేర నిధులు రాబట్టారని జగన్ సర్కారును రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ ఎంపీల మీద ప్రతాపం చూపించడానికి మిమ్మల్ని పార్లమెంటుకు ప్రజలు పంపారా? అని వైసీపీ ఎంపీలను నిలదీశారు.

జగన్ ఎందుకంత భయం..?

జగన్ ఎందుకంత భయం..?

హోదా విషయంలో టీడీపీపై చేసిన ఆరోపణలు జగన్ మర్చిపోయారా? ఆయన మాట్లాడిన మాటల సీడీలను తాము పంపిస్తామని అన్నారు. హోదా ఎలా సాధిస్తారు.. ఎంత మందితో రాజీనామా చేయిస్తారని జగన్మోహన్ రెడ్డిని రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. హోదా రాకుంటే రాష్ట్రం మూతపడుతుందని అన్నారు.. పరిశ్రమలు రావాన్నారు.. ఇప్పుడేమో మీడియా ముందుకు రావాలంటే భయపడుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసం చేసే నిర్ణయాలు మాత్రం సీఎం జగన్ తీసుకుంటున్నారని రామ్మోహన్నాయుడు ఆరోపించారు. 29వేల మంది అమరావతి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని.. ఇప్పటికే 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాజధాని కోసం భూములిస్తే.. వైసీపీ సర్కారు కాంట్రాక్టులు రద్దు చేస్తామనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ఢిల్లీ కేసులు, ప్రలోభాల కోసమేనా..?

ఢిల్లీ కేసులు, ప్రలోభాల కోసమేనా..?

కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామన్న జగన్.. ఇప్పుడేం చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇక్కడేవున్నారని.. మెడలు వంచి హోదా తీసుకురండి అని వైసీపీ ఎంపీలకు సూచించారు. హోదా కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డ రామ్మోహన్నాయుడు.. కేసులు, ప్రలోభాల కోసం ఢిల్లీని ఉపయోగించుకుంటున్నారని వైసీపీ ఎంపీలపై ధ్వజమెత్తారు. రాత్రులు కూడా మంత్రులను కలుస్తున్నారని అన్నారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి..

కేంద్రం జోక్యం చేసుకోవాలి..

ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. 50వేల మంది రైతులు జీవితాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంం వెంటనే జోక్యం చేసుకుని రాజధాని అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరినట్లు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. మూడు రాజధానులకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. పార్లమెంటులో ఇతర సభ్యుల దృష్టికి కూడా రైతుల సమస్యలను తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు కనకమేడల తెలిపారు.

English summary
TDP MP kinjarapu rammohan naidu hits out at cm ys jagan and ysrcp mps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X