విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెడిసి కొట్టిన కొడాలి నాని చ‌ర్చ‌లు..! వైసీపి నుండి వెళ్లిపోవ‌డానికే రాధ మొగ్గు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : గ‌త కొద్ది రోజులుగా ఏపి రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తున్న వంగవీటి రాధా ఎపిసోడ్ ఇంకా జ‌న‌రంజ‌కంగానే సాగుతోంది. ఆయ‌న ఏపార్టీలోకి వెళ్తారు..? అస‌లు వైసీపిని ఎందుకు వీడుతున్నారు అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లుగా త‌యార‌య్యాయి. వైసీపి సీనియ‌ర్ నాయ‌కుల‌తోపాటు ఆయ‌న స‌న్నిహితులు కూడా పార్టీ మారొద్ద‌ని రాధాతో మంత‌నాలు జ‌రిపారు. కాని అలాంటి చ‌ర్చ‌లు ఏవీ కూడా ఫ‌లించ‌లేదు. చివ‌రికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రంగంలోకి దిగిన‌ప్ప‌టికి ఫ‌లితంక‌నిపించ‌లేదు. కొడాలి నాని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వంగ‌వీటి రాధాతో సత్సంభాదాలు క‌లిగిఉన్న విష‌యం తెలిసిందే..!

ర‌స‌వ‌త్త‌రంగా మారిని రాధా ఎపిసోడ్..! పార్టీ మారేందుకే నిర్ణ‌యం..!!

ర‌స‌వ‌త్త‌రంగా మారిని రాధా ఎపిసోడ్..! పార్టీ మారేందుకే నిర్ణ‌యం..!!

వంగ‌వీటి రంగా వారసుడిగా వచ్చిన రాధాకృష్ణ పైన ఆ సామాజిక వర్గ ఒత్తిడి కొంత మేర ప‌ని చేస్తూ వస్తుంది. గతంలో వైసీపీ నేత ఒక‌రు రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కాపులంతా ముక్తకంఠంతో ఖండించారు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాధా ఎపిసోడ్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అసలు రాజీనామా చేయ‌డానికి గ‌ల కారణాలను, రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి రెండు రోజుల్లో వెల్లడిస్తానని మీడియా ముందు రాధా చెప్పారు. దీంతో వంగవీటి ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో మ‌రింత చర్చనీయాంశం అయింది.

తెలుగుదేశ‌మా..! జ‌న‌సేనా..? ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక పోతున్న రాధా..!!

తెలుగుదేశ‌మా..! జ‌న‌సేనా..? ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక పోతున్న రాధా..!!

ఇప్పుడు వంగవీటి ఎవరై వైపు? జనసేనాని వైపా! లేక చంద్రబాబు గూటికా? అనే అంశం పై అమ‌రావ‌తి ప్ర‌జ‌ల్లో పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు ఆయన జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, వంగవీటి అనుచ‌రులు దీనిపైన ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తానని చెప్పి రాకపోవడం, ఆ తర్వాత వంగవీటి పరాజయం వంటి చేదు అనుభ‌వాల‌ను రాధా ఇప్ప‌టికి గుర్తు చేస్తూ వ‌స్తున్నారు.

గ‌తంలో ప‌వ‌న్ తో చేదు అనుభ‌వం..! రాధా మ‌న‌స‌లో ఏముంది..?

గ‌తంలో ప‌వ‌న్ తో చేదు అనుభ‌వం..! రాధా మ‌న‌స‌లో ఏముంది..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీపైన రాధా కాస్త అస‌హ‌నంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. జనసేనలో చేరే అవకాశాలు పెద్దగా లేవని అంటున్నారు వంగవీటి వర్గీయులు. ఇక ఆయనకున్న మరో అవ‌కాశం తెలుగు దేశం పార్టీ. నిజానికి వంగవీటి వైసీపీకి రాజీనామా చేసింది కూడా టీడీపీలో చేరడానికనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయినా దీన్ని వంగవీటి ఖండించకపోవడం గమనార్హం. అయితే ఆయన ఒకవేళ టీడీపీలో చేరినా కూడా విజయవాడలో ఆయనకు సీటు లభించే అవకాశమైతే లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే టీడిపిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మ‌ద్య తెగ పోటీ నెల‌కొంది.

ఎమ్మెల్యే కాక‌పోతే ఎమ్మెల్సీ ..! టీడీపిలో అద‌న‌పు అవ‌కాశం..!!

ఎమ్మెల్యే కాక‌పోతే ఎమ్మెల్సీ ..! టీడీపిలో అద‌న‌పు అవ‌కాశం..!!

కాకపోతే ఆయనకు కృష్ణా జిల్లాలో ఏదో ఓ స్థానం ఇవ్వడానికి టీడీపీ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఆయన చంద్రబాబు దగ్గరకు వచ్చారంటే ఎమ్మెల్సీ పదవి దక్కనుందని మరో ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి వంగవీటి రాధా చంద్రబాబుకే జై కొట్టనున్నారనే చ‌ర్చ బలంగా సాగుతోంది. ఐన‌ప్ప‌టికి యూత్ ఐకాన్ గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క బాద్య‌త‌లు ఇస్తాన‌ని హామీ ఇస్తే గ‌న‌క మ‌ళ్లీ రాధా పున‌రాలోచించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. చివ‌రి నిమిసంలో వంగవీటి రాధా ఏ పార్టీ గూటికి చేరుతారో చూడాలి.

English summary
Former YCP leader Vangaveeti Radha had been a hot topic in AP politics for the past couple of months. After tendering his resignation to the YCP its creating a curiosity among AP people as which party Vangaveeti would Step into.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X