kodali nani chandrababu balakrishna election campaign hindupur ap local body elections కొడాలి నాని చంద్రబాబు బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
బాలకృష్ణ ఆటలో అరటిపండు , చంద్రబాబు శనిగ్రహం : ఉతికారేసిన మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు పీక్స్ కు చేరుకుంది . హోరాహోరీగా అధికార , ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మంత్రులు సైతం ఎన్నికళ ప్రచారం నిర్వహించటమే కాకుండా చంద్రబాబును టీడీపీ నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సంచలన , వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన కొడాలి నానీ చంద్రబాబు, బాలయ్యలపై విరుచుకుపడ్డారు .

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడు
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబును, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఉతికి ఆరేశారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో వైసీపీ మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన కొడాలి నాని బాలయ్య ను టార్గెట్ చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు. బాలయ్యకు ఏదీ చేతకాదని పేర్కొన్నారు . బాలకృష్ణ సినిమా షూటింగ్ ల కోసం ఇతర దేశాలు రాష్ట్రాల్లో తిరుగుతారని, ఏపీలో పరిస్థితులు ఆయనకు తెలియవని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

బాలకృష్ణను ఆటలో అరటిపండు అంటూ కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు
బాలకృష్ణను ఆటలో అరటిపండు అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు
. హిందూపురంలో ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు . వైసీపీ హయాంలో రాష్ట్రం నాశనం అయిందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని , వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి చూపించాలని బాలయ్య సవాల్ చేశారు . బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ గా కొడాలి నాని బాలకృష్ణ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

చంద్రబాబు శనిగ్రహం .. ఎన్టీఆర్ అప్పుడే చెప్పాడు
ఇక ఇదే సమయంలో చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికి పోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మైండ్ చెడిపోయిన విషయం అందరికీ తెలుసనీ ఆయన పేర్కొన్నారు . విశాఖ ఉక్కు విషయంలో మోడీని ప్రశ్నించ లేక చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాజధానికి చంద్రబాబు ఒక శని గ్రహం లాంటివాడిని, ఈ విషయం ఎప్పుడో ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

టీడీపీ నేతలు శని వదిలించుకోవటానికి చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు
శని వదలాలంటే చంద్రబాబుకు పూజలు చేయాలని, పేర్కొన్న కొడాలి నాని టిడిపి నేతలు తమ శని వదిలించుకోవటం కోసం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోర పరాజయం తప్పదని వ్యాఖ్యానించిన కొడాలి నాని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయి అంటూ పేర్కొన్నారు.