విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..? పందికొక్కుల్లా మేసిన చంద్రబాబు, లోకేష్‌లను..’

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం రేపింది. ఈ విషయంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్: వందలమంది ఇంట్లో చొరబడ్డారు! భార్య, ఫ్యామిలీ ఏమన్నారంటే?అచ్చెన్నాయుడు అరెస్ట్: వందలమంది ఇంట్లో చొరబడ్డారు! భార్య, ఫ్యామిలీ ఏమన్నారంటే?

14ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా?

14ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా?

రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని నాని స్పష్టం తెలిపారు. 70ఏళ్ల వయస్సు, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఏసీబీ ఒక ఎమ్మేల్యేను అరెస్ట్ చేసేటప్పుడు ఎలా వెళ్తారో తెలియదా? అని ప్రశ్నించారు. ఈఎస్ఐలో రూ. 150 కోట్ల స్కాం జరిగిందని, కొనాల్సినవి, కొనకూడనవి అన్ని జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు.

తప్పు చేసినా అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు రాజ్యంగంలో ఉందా?

తప్పు చేసినా అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు రాజ్యంగంలో ఉందా?

ఎవరెవర్ని అరెస్ట్ చేయకూడదో చంద్రబాబు ఒక లిస్ట్ ఇవ్వాలని.. తప్పు చేసిన వారిని విచారించొద్దని చంద్రబాబు రాజ్యాంగంలో ఉందా? అని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడికి ఓ ఐదు కోట్లు ఇచ్చి ఉంటారని, మిగతాది పందికొక్కులా లోకేష్ తినేసి ఉంటాడని విమర్శించారు.

అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..

అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..


అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారి ఈఎస్ఐ కుంభకోణం వెనుక ఉన్నవారి పేరు చెబితే తనను వదిలి పందికొక్కులను పట్టుకుంటామని కొడాలి నాని అన్నారు. తమ ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహించరని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను తాము విచారిస్తున్నామని చెప్పారు.

Recommended Video

ESI స్కామ్‌ : Jagan రైట్ అంటున్న BJP పనిలో పనిగా Chandrababu కు చెక్
అరెస్ట్ చేన్తే కిడ్నాప్ అంటారా?

అరెస్ట్ చేన్తే కిడ్నాప్ అంటారా?

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014-18 వరకు ఈఎస్ఐలో జరిగిన అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలతో ఏసీబీ.. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిందన్నారు. ఏసీపీ అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారనడం దారుణమని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం బీసీ కార్డు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐలో రూ. 150 కోట్ల భారీ స్కాం జరిగిందని, అందుకే గతంలో డిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తిని, అతని కుమారుడ్ని, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ సర్కారు అక్రమ అరెస్టు చేయదని.. పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు.

English summary
kodali nani slams chandrababu on atchannaidu arrest issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X