విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెత్తందారి వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడారు.. కోడెల మృతి తీరని లోటన్న ధూళిపాళ్ల

|
Google Oneindia TeluguNews

అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు. టీడీపీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలుఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలు

కోడెల శివప్రసాద్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బాంతికి గురిచేసిందన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. యువ నాయకులకు కోడెల శివప్రసాద్ లాంటి నేత స్పూర్తి అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అని కొనియాడారు. ఇక్కడ జరిగే దౌర్యన్యాలకు ఎదురొడ్డి పోరాడారని గుర్తుచేశారు. అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో ఆకర్షితులై ... పార్టీలో చేరారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే నుంచి మంత్రి, స్పీకర్ పదవులు చేపట్టి .. పదవులకే వన్నె తీసుకొచ్చారని పేర్కొన్నారు. తమ లాంటి యువ నాయకులకు కోడెల శివప్రసాద్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో హోంమంత్రి, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవులను నిర్వహించారని గుర్తుచేశారు. ఏపీలో స్పీకర్‌గా పనిచేసి .. పదవీకే వన్నె తీసుకొచ్చారని పేర్కొన్నారు.

kodela dead is Deficit to party says narendra

తన నియోజకవర్గం సత్తెనపల్లి అభివృద్ధికి అహార్నిసలు పాటుపడ్డారని పేర్కొన్నారు. కోటప్పకొండ డెవలప్ చేశారని, ఎన్టీఆర్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభించారని పేర్కొన్నారు. పల్నాడు రాజకీయాలను శాసించిన కోడెలది ప్రత్యేక స్థానమని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని .. కానీ వైసీపీ సర్కార్ మాత్రం తమను తీవ్రంగా వేధించిందని ఇటీవల కార్యకర్తలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

English summary
The sudden death of Kodela Sivaprasad has caused severe shock, says TDP leader Dhulipalla Narendra. Youngers like Kodela Sivaprasad is a leader. Guntur district is known as the hero of kodela. He recalled that he had fought the tyranny of the fort here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X