విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రానురానుంటూనే..టిడిపికి మ‌ద్ద‌తుగా: తెర వెనుక వ్యూహాల్లో ల‌గ‌డ‌పాటి..!

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయ స‌న్యాసం కొన‌సాగిస్తా..ఏ పార్టీలో చేర‌ను...ఇదీ ప‌దే ప‌దే మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెబుతున్న మాట‌లు . అయితే, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేక‌పోయినా..ఎన్నిక‌ల వేళ‌..టిడిపికి మ‌ద్ద‌తుగా తెర వెనుక రాజ‌కీయాల్లో మాత్రం బిజీగా క‌నిపిస్తున్నారు. ఎలాగైనా చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి రావాల‌నే ల‌క్ష్యంగా వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు.

Lagadapati new statement in old version : indirectly supporting CBN

రాజ‌కీయ స‌న్యాసం కొన‌సాగిస్తా..
2014 లో రాష్ట్ర విభజన జ‌ర‌గ‌దు..జ‌రిగితే తాను రాజ‌కీయాల నుండి దూమ‌వుతాన‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. 2014 లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిపోయింది. ఆ త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో నూ ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా పోటీ చేయ‌టం లేదు. ఏ పార్టీలో చేర‌ను అని ప‌దే ప‌దే ల‌గ‌డ‌పాటి చెబుతూ వ‌స్తున్నారు. తాజాగా మ‌రో సారి తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే, కొద్ది కాలంగా ల‌గ‌డ‌పాటి ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. పార్టీ వ్యూహాలు..నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స్థితి గతులు పై ఎప్ప‌టిక‌ప్ప‌డు నివేదిక‌లు అందిస్తున్నారు. ఇక‌..పారిశ్రామిక వేత్త అయిన ల‌గ‌డ‌పాటి ఈ మ‌ధ్య కాలంలోనే ఏపి ప్ర‌భుత్వం నుండి ఒ ప్రాజెక్ట్ ద‌క్కించుకున్న‌ట్లుగా ప్ర‌చారం. ఇక‌, ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా టిడిపి తిరిగి అధికారంలోకి రావాల‌ని ల‌గ‌డ‌పాటి కోరుకుంటున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ టిడిపి-కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తారంటూ ఎన్నిక‌ల‌కు ముందు స‌ర్వే వివ‌రాలు ప్ర‌క‌టించారు. ఫ‌లితాలు వెల్ల‌డైన త‌రువాత వివ‌ర‌ణ ఇచ్చారు.

కిడారికి పట్టిన గతే మీకూ పడుతుంది: ఎమ్మెల్యే యరపతినేనికి మావోయిస్టుల బహిరంగ లేఖ కిడారికి పట్టిన గతే మీకూ పడుతుంది: ఎమ్మెల్యే యరపతినేనికి మావోయిస్టుల బహిరంగ లేఖ

టిడిపికి తెర వెనుక వ్యూహాలు..
ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభ‌మైన నాటికి ముందే ల‌గ‌డ‌పాటి టిడిపిలో చంద్ర‌బాబు కు త‌న వంతు స‌హ‌కారం అందిస్తు న్నారు. తెర వ్యూహాల‌ను సిద్దం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో ఉండాల్సిన అభ్య‌ర్ధులు..వారి విజయ‌వ‌కాశాలు.. ఏ వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే అంశం పై ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల కు కొన్ని సూచ‌న‌లు జ‌త చేస్తున్నారు. ఇక‌, వంగ‌వీటి రాధా వంటి వారిని టిడిపికి ద‌గ్గ‌ర చేయ‌టం లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తొలి నుండి వైసిపి అధినేత జ‌గ‌న్ పై ల‌గ‌డ‌పాటి వ్య‌తిరేక భావంతోనే ఉన్నారు. జ‌గ‌న్ సైతం సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీ సారి ల‌గ‌డ‌పాటి పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ల‌గ‌డ‌పాటి..స‌బ్బం హ‌రి వంటి వారు పూర్తి స్థాయిలో జ‌గ‌న్ ను లక్ష్యంగా చేసుకొని రానున్న రోజుల్లో ప్ర‌జ‌ల ముందుకు రానున్నారు. దీంతో.ల‌గ‌డ‌పాటి రానురాను అంటూనే రాజ‌కీయంగా తన ఆలోచ‌న‌లు..ప్ర‌యోజ‌నాల మేర‌కు ఎన్నిక‌ల వేళ అడుగులు వేస్తున్నారు.

English summary
Ex mp Lagadapati Raja Gopal once again clarified that he will not join in any party as well do not contest in elections. But, he supporting Chandra Babu in party strategies and candidates selection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X