• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ల‌క్ష్మీనారాయ‌ణ యూ ట‌ర్న్‌: త‌డ‌బాటా..త‌ప్ప‌ట‌డుగులా..వెనుక ఉన్న‌దెవ‌రు..!

|

సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీ నారాయ‌ణ రాజ‌కీయంగా త‌డ‌బ‌డుతున్నారా. త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారా. ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ రంగంలోకి ప్ర‌వేశించాల‌ని నిర్ణ‌యించిన‌ప్పి నుండి అనేక అంచ‌నాలు వినిపిస్తూ వ‌చ్చాయి. తొలుత బిజెపి లో చేరుతార‌ని..జ‌న‌సేన నుండి ఆహ్వానం ఉంద‌ని..ఆప్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని ఈ విధంగా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రిగింది. నాలుగు రోజుల క్రిత‌మే లోక్‌స‌త్తా ఏపి బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు స‌మావేశం సైతం నిర్వ‌హించారు. అయితే, మ‌ద్ద‌తుదారులు ఒప్పుకోలేద‌ని చెబుతున్న ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌ర లోనే త‌న రాజ‌కీయ పార్టీ..విధి విధానాల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని వెల్ల‌డించారు.

సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీ నారాయ‌ణ లోక్‌స‌త్తా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టం లేదు. లోక్‌స‌త్తా బాధ్య‌త‌లు ల‌క్ష్మీనారాయ‌ణ కు అప్ప‌గించి...మాజీ ఐఏయ‌స్ అధికారి జెపి స‌ల‌హాదారుడి పాత్ర పోషించాల‌ని భావించారు. ఈ మేర‌కు జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనూ అభిప్రాయం కుదిరింది. ఈ మేర‌కు ఈ నెల 26న ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేసి త‌న మ‌ద్ద‌తు దారుల‌తో దీని పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా..తాను లోక్‌స‌త్తా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టం లేద‌ని..

Lakshmi narayana not interest on Loksatta : decided to start new political party...!

ఇందుకు మ‌ద్ద‌తు దారులు అంగీక‌రించం లేద‌ని ల‌క్ష్మీనార‌య‌ణ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. త‌న మ‌ద్ద‌తు దారుల అభిప్రాయం మేర‌కే తాను న‌డుచుకుంటాన‌ని స్ప‌ష్టం చేసారు. రాజ‌కీయంగా ఏం చేయాలో తాను త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటానిని విధి విధానాల‌తో స‌హా అన్ని విష‌యాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, లోక్‌స‌త్తా బాధ్య‌త‌లు స్వీక రించాల‌ని దాదాపు నిర్ణ‌యించి...ప్ర‌జ‌ల్లోకి విష‌యం తీసుకెళ్లిన త‌రువాత ఇప్పుడు రెండు రోజులకే ల‌క్ష్మీ నారాయ‌ణ త‌న నిర్ణ‌యాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వ‌చ్చింది.. దీని వెనుక కార‌ణం ఏంట‌నే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.

ల‌క్ష్మీనారాయ‌ణ పై రాజ‌కీయంగా కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయ‌నే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది. ఏపిలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ల‌క్ష్మీనారాయ‌ణ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై కొంత డైల‌మా లో ఉన్న‌ట్లుగా కనిపిస్తోంది. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ప్రారంభం కావ‌టంతో పాటుగా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామంటూ ఇప్ప‌టికే ల‌క్ష్మీ నారాయ‌ణ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసారు. టిడిపి -వైసిపి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ కాగా..జ‌న‌సేన ప్ర‌భావితం చేయ‌నుంది. ఇక‌, కాంగ్రెస్ -బిజెపి సైతం పోటీ లో ఉంటాయి.

వామ‌ప‌క్షాలు ఇప్ప‌టికే జ‌గ‌న్ తో ఉన్నట్లుగా సంకేతాలిస్తున్నారు. ఇక‌.. కొత్త‌గా రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసి ఎవ‌రికైనా మ‌ద్ద‌తు ఇవ్వాలా..లేక స్వ‌తంత్రంగా పోటీ చేయాలా అనే సందిగ్ద‌త కొన‌సాగు తున్నట్లు స‌మాచారం. అధికార పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేని ప‌రిస్థితి..ప్ర‌తిప‌క్షంతో స‌ఖ్య‌త‌కు అవ‌కాశాలు లేవు. ఇక‌, పొత్తు పెట్టుకోవ‌టం కోసం పార్టీ ఏర్పాటు చేస్తే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక సంకేతాలు వెళ్తాయ‌నే భ‌యం వారిని వెంటాడుతోంది. దీంతో .. జాతీయ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉండాలా..

లేక ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి న‌డ‌వాలా అనే చ‌ర్చ సాగుతోంది. ఒంట‌రి గా పోటీ చేయాల‌నే ఒత్తిడి ల‌క్ష్మీ నారాయ‌ణ పై మ‌ద్ద‌తు దారుల నుండి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ల‌క్ష్మీ నారాయ ణ వెనుక ఉండి కొంద‌రు పెద్ద‌లు న‌డిపిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపిలో రాజ‌కీయంగా అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి. ఈ ప‌రిస్థితుల్లో ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయంగా ఫైన‌ల్ నిర్ణ‌యం ఏ విధంగా తీసుకుంటారు..ఎటువంటి ప్ర‌భావం చూపిస్తుంద‌నే అంచనాలు మొద‌ల‌య్యాయి.

English summary
CBI ex JD Lakshmi Narayana decided to not take charge as Loksatta Chief. As his Followers suggestion he decided to start new Political party in AP. He stated that as early as possible he may anounce his new party details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X