విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశ్నార్ధకంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను మార్చిన కరోనా .. ఆరు వారాల తర్వాత కూడా సందిగ్ధమేనా !!

|
Google Oneindia TeluguNews

ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో ఏం జరగబోతుంది. కరోనా ప్రభావం నేపధ్యంలో ఎన్నికలను అయు వారాల పాటు వాయిదా వేసిన ఎన్నికల సంఘం ఆరు వారాల తర్వాత కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తుందా? తాజాగా ఏపీలో మరో కరోనా కేసు నమోదైంది. కరోనా అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతున్న తరుణంలో ఆరు వారాల తర్వాత పరిస్థితి కంట్రోల్ లోకి వస్తుందా ? ఒక వేళ రాకుంటే ఎన్నికలను మరోమారు వాయిదా వేస్తారా ? లేకా ఎన్నికలను రద్దు చేస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు ఏపీ వాసులలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చర్చకు కారణం అవుతున్నాయి.

ఆరువారాల తర్వాత ఎన్నికలపై నెలకొన్న కన్ఫ్యూజన్

ఆరువారాల తర్వాత ఎన్నికలపై నెలకొన్న కన్ఫ్యూజన్

ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై అధికార వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోబోమని కాకుంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఎత్తి వేయాలని సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో తన అభిప్రాయం వ్యక్తం చేసింది . ఇక కరోనా వైరస్ వ్యాప్తి ద్రష్ట్యా ఎన్నికలు వాయిదా వేసినట్టు ఎలక్షన్ కమీషన్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళగా ఎన్నికల నిర్వహణపై పూర్తి విచక్షణాధికారం ఎన్నికల సంఘానిదే అని తేల్చేసింది సుప్రీం ధర్మాసనం . ఇక దీంతో కరోనా తగ్గే వరకూ ఎన్నికలు ఉండనట్లే అన్న భావన వ్యక్తం అవుతుంది .

జాతీయ విపత్తు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటేనే ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్

జాతీయ విపత్తు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటేనే ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్

కరోనా నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమీషన్ కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారుతుంటే ఆరు వారాల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 166 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏపీలోనూ రెండు కరోనా కేసులను గుర్తించారు . స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా నిర్వహించేలా చేయాలని ప్రయత్నించిన ఏపీ సర్కార్‌కు కరోనా అడ్డం వచ్చింది. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగా కేంద్రం నిర్ధారించి జాతీయ విపత్తు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటేనే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని చర్చ జరుగుతుంది .

ఆరు వారాల తర్వాత సాధారణ స్థితి కష్టమేనా ? అలా అయితే ఎన్నికలు జరిగేనా

ఆరు వారాల తర్వాత సాధారణ స్థితి కష్టమేనా ? అలా అయితే ఎన్నికలు జరిగేనా

భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ రెండో స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇలాంటి సమయంలో ఆరు వారాల తర్వాత పరిస్థితి సాధారణ స్థితి వస్తుందా అంటే కష్టమే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది . ఇక ఎన్నికలు ఆరు వారల తర్వాత జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అయినప్పటికీ తాజాగా నెలకొన్న పరిస్థితులు మాత్రం ఎన్నికలకు అనుకూలంగా లేదని అర్ధం అవుతుంది. పరిస్థితి అంతా సద్దుమణిగి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.

 ఇప్పటివరకు ఉన్న ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తారా ? లేకా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా

ఇప్పటివరకు ఉన్న ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తారా ? లేకా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా

ఓ సారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరవాత మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ప్రక్రియ మొత్తం కొత్తగా ప్రారంభించినట్లేనన్న వాదన ఉంది. ఎన్నికల నిర్వహణ విషయంలో జాప్యం ఎక్కువ జరిగితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియకు కొనసాగింపుగా ఎన్నికలను నిర్వహిస్తారా లేకా కొత్తగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారా అనేది ఎన్నికల సంఘం నిర్ణయంతోనే ముడిపడి ఉంది . ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే ప్రస్తుతం ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఇరవై రోజులకు అటూ ఇటూగా అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రకారం జరిగే అవకాశం లేదు .

ఆర్డినెన్స్ ప్రకారం చూసినా ప్రశ్నార్ధకం అయిన ఎన్నికల ప్రక్రియ

ఆర్డినెన్స్ ప్రకారం చూసినా ప్రశ్నార్ధకం అయిన ఎన్నికల ప్రక్రియ

అనూహ్య కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో.. ఆ ఆర్డినెన్స్ ప్రకారం చూసినా ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకమేనా అన్న భావన కలుగుతుంది . ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ వాయిదా మాత్రమే పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోంది. మామూలుగా నామినేషన్ల ఉపసంహరణకు ఒక్క రోజు గడువు ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా చాలా రోజులు సమయం ఇచ్చినట్లు అవుతోంది. అది కూడా ఒక రకంగా ఇబ్బందికర పరిణామమే .

 కేంద్రానికి ఎన్నికల కమీషనర్ లేఖతో మరింత జఠిలం అయిన ఎన్నికల ప్రక్రియ

కేంద్రానికి ఎన్నికల కమీషనర్ లేఖతో మరింత జఠిలం అయిన ఎన్నికల ప్రక్రియ


ఎన్నికల కమిషనర్ కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారయంత్రాంగం సహకరించలేదని , తప్పుడు నివేదికలు ఇచ్చారని, అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు అయ్యాయని కేంద్రానికి లేఖ రాశారు. ఇక ఈ నేపధ్యంలో కూడా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ కు వెళ్తారా అన్నది కూడా ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కరోనా ఆరు వారాల్లో కంట్రోల్ లోకి వస్తుందా ? ఎన్నికల ప్రక్రియను ఎక్కడ ఆపేశారో.. అక్కడి నుంచే కొనసాగిస్తారా .. లేకా తాజా రాజకీయ పరిణామాలతో కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది . దీంతో ఎలక్షన్ కమీషన్ నిర్ణయం ఎలా ఉంటుందో అన్న డైలమాలో అటు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ప్రజల్లోనూ ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది.

English summary
If the corona outbreak becomes alarming, the opinion is local bodies elections are unlikely to be held after six weeks. Already 166 corona cases have been reported across the country. Two corona cases were identified in the AP. There is talk that local body elections are unlikely to go to the polls unless the Center confirms that the corona is in full control and withdraws the national disaster order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X