విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడెల కుమారుడితో లోకేశ్ వాటాలు.. మృతి కేసులో చంద్రబాబు A-1... కోడెల పులి, బాబు నక్క : కొడాలి

|
Google Oneindia TeluguNews

అమరావతి : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణం ముమ్మాటికీ చంద్రబాబే కారణమన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. గత ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లిలో అవినీతికి తెరతీసింది ఎవరు అని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణతో కే ట్యాక్స్ వసూల్ చేయించింది లోకేశ్ కాదా అని నిలదీశారు. అప్పుడు బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి .. వ్యాపారులను దోచారని ఆరోపించారు. తీరా ఇప్పుడు నెపం మొత్తం కోడెల కుమారుడు, కూతురిపై వేశారని పేర్కొన్నారు.

కోడెల ఆత్మహత్య కేసుల వల్ల కాదు.. చంద్రబాబు దూరం పెట్టడం వల్లే... ఏపీ మంత్రి కొడాలి నాని సంచలనంకోడెల ఆత్మహత్య కేసుల వల్ల కాదు.. చంద్రబాబు దూరం పెట్టడం వల్లే... ఏపీ మంత్రి కొడాలి నాని సంచలనం

తప్పులు చేయించి ..

తప్పులు చేయించి ..

ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు చేయించి .. అధికారం దూరమయ్యాక తప్పుకుంది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు కొడాలి నాని. కోడెల కుమారుడు, కూతురిపై కేసులు పెట్టడంతో మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నించినా ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అడిగారు. గత 10 రోజుల నుంచి రేపు మాపు అని దాటవేసింది నిజం కాదా అన్నారు. 5 రోజుల్లో కలుద్దాం .. రేపు అని చెప్పి .. దాక్కున్నారని ఆరోపించారు. చివరకు ఆయన చనిపోయే వరకు కూడా అపాయింట్‌మెంట్ కోసం చూశారని తెలిపారు. వదిలించుకునే ప్రయత్నం చేశావని మండిపడ్డారు. ఆయనకు ఈ దుస్థితి పట్టించింది చంద్రబాబే అని స్పస్టంచేశారు. కోడెలను కలిసే అవకాశం ఇవ్వకుండా .. చంపింది చంద్రబాబే అని విమర్శించారు కొడాలి నాని.

ఒంటరిని చేసి

ఒంటరిని చేసి

కలువకుండ ఉండటమే కాదు .. సత్తెనపల్లిలో కూడా కోడెలను ఒంటరి చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గానికి వెళ్లనీయకుండా చేశారని తెలిపారు. పార్టీ నుంచి క్రమంగా తప్పించే ప్రయత్నం చేశారని .. సాదక బాధలు చెప్పుకోనియలేదని పేర్కొన్నారు. దీంతో అవమాన భారంతోనే కోడెల ఆత్మహత్య చేసుకునేందుకు సాహసించి ఉంటారని తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌ ఎలాగైతే చనిపోయేందుకు ప్రేరేపించారో .. కోడెల వ్యవహారంలో కూడా అలానే జరిగిందన్నారు. ఎన్టీఆర్ శవయాత్రలో పాల్గొని దొంగ ఏడుపు ఏడ్చాడని .. ఇప్పుడు కోడెల విషయంలో కూడా అలానే చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ పాల్నటి ప్రజలకు అన్నీ తెలుసు అని .. మీకు బుద్ది చెప్తారని వెల్లడించారు.

అడ్డుకొని

అడ్డుకొని

గత 9 రోజుల క్రితం పల్నాడులో వైసీపీ బాధితుల క్యాంపు నిర్వహించిన చంద్రబాబు కోడెల శివప్రసాద్‌ను ఎందుకు రానీయలేదని ప్రవ్నించారు. పల్నాడులో కోడెల శివప్రసాద్ వైసీపీ బాధితుడు కాదా అని అడిగారు. అతని కుమారుడు, కూతురుపై కేసులు నమోదు చేయలేదా అని కొశ్చన్ చేశారు. మరి అయితే ఎందుకు కోడెలను దూరంగా ఉంచావని అడిగారు. పల్నాడులో జరుగుతున్న ఆందోళనకు పల్నాటి పులిని ఎందుకు రానీయలేదన్నారు. కావాలనే దూరం పెట్టి .. మానసిక క్షోభకు గురిచేశారని కొడాలి నాని ఆరోపించారు. కోడెల చనిపోయారని మీడియాలో వార్తలొచ్చినా పిల్లిలా చంద్రబాబు దాక్కున్నారని విమర్శించారు. సూసైడ్ నోట్ దొరుకుతుందా అని భయపడింది నిజం కాదా అని ప్రశ్నించారు. సూసైడ్ నోట్ లేదని తెలిసి .. పులిలా మారవని విమర్శించారు.

నిగ్గుతేల్చండి

నిగ్గుతేల్చండి

కోడెల శివప్రసాద్ కేసును నిష్పాష్పపాతంగా దర్యాప్తు చేయాలని సీఎం కేసీఆర్‌ను విన్నవించారు ఏపీ మంత్రి కొడాలి నాని. 306 కేసు చంద్రబాబుపై పెట్టాలని కోరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అని .. కానీ ఆ కేసు నీరుగారిపోయిందన్నారు. కానీ కోడెల శివప్రసాద్ హత్య కేసులో ఏ-1 నిందితుడిగా చంద్రబాబు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడులకు లొంగొద్దని కోరారు.

English summary
Former speaker Kodela Sivaprasad suicide was attributed to Chandrababu, AP minister Kodali Nani. Asked who opened up the corruption in Sattenapalli during the last government regime. Lokesh is not sure whether K tax collections with Sivaramakrishna, the son of Kodela Sivaprasad, is taxing. Then threatened, terrified .. and accused the traders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X