• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జ‌గ‌న్ కు లోకేశ్ వార్నింగ్‌: గుర్తుపెట్టుకో..అధికారం శాశ్వ‌తం కాదు: స‌హ‌నం పరీక్షించొద్దు....!

|

మాజీ మంత్రి లోకేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ ఓ వైపు నీతులు చెబుతూనే మ‌రో వైపు తాను అనుకున్న‌దే జ‌గ‌న్ చేసేస్తున్నారంటూ లోకేశ్ మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి నివాసానికి స‌మీపంలోనే హ‌త్య జ‌రిగితే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్న‌ట్లా లేన‌ట్లా అని ప్ర‌శ్నించారు. ఏపీనీ నెల రోజుల్లోనే మ‌రో బీహార్ చేసేసారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ గుర్తు పెట్టుకో..అధికారం శాశ్వ‌తం కాదు..మా స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు అంటూ జ‌గ‌న్‌కు లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.

బీహార్‌లా మార్చేసారు..

బీహార్‌లా మార్చేసారు..

మాజీ మంత్రి..టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు..ఎమ్మెల్సీ లోకేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన విరుచుకుప‌డ్డారు. మంగ‌ళ‌గిరిలో హ‌త్యకు గురైన ఉమా యాద‌వ్ కుటుంబాన్ని లోకేశ్ ప‌రామ‌ర్శించారు. స్థానికంగా ఉన్న విబేధాల కార‌ణం గానే ఆయ‌న్ను ప్ర‌త్య‌ర్దులు హ‌త్య చేసార‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ఇందులో అయిదుగురు పోలీసుల ముందు లొంగి పోయిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో..హ‌త్యకు గురైన యాద‌వ్ కుటుంబాన్ని లోకేశ్ ప‌రామ‌ర్శించి జ‌గ‌న్ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ముఖ్య‌మంత్రి ఇంటికి అతి స‌మీపంలోనే హ‌త్య జ‌రిగితే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్న‌ట్లా..లేన‌ట్లా అని ప్ర‌శ్నించారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పైన దాడులు పెరిగిపోతు న్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్యకు గుర‌య్యార‌ని వివ‌రించారు. గ్రామాల్లో వైసీపీ వారికి ఓట్లు వేయ‌ని ఇళ్ల మ‌ధ్య‌లో గోడ‌లు క‌డుతున్నారంటూ చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్‌కు ఇలా వార్నింగ్‌..

జ‌గ‌న్‌కు ఇలా వార్నింగ్‌..

ముఖ్య‌మంత్రి జ‌గన్‌కు ఎమ్మెల్సీ లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వైపు ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ నీతులు చెబుతూనే.. మ‌రో వైపు తానున అనుకున్న‌ది చేసేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారం శాశ్వ‌తం కాద‌నేది జ‌గ‌న్ గుర్తు ఉంచుకోవాల ని లోకేశ్ సూచించారు. గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైయ‌స్సార్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కూడా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను దారుణంగా హ‌త్య చేయించారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఇప్పుడు కూడా అవే పద్ధతులు పునరావృతం అవుతు న్నాయని అన్నారు. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదనే విష‌యం జ‌గ‌న్ గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు. హ‌త్యా రాజ‌కీయాలు మంచిది కాద‌నే విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. త‌మ ఓపిక‌నున ప‌రీక్షంచొద్ద‌ని లోకేశ్ ముఖ్య‌మంత్ర ని హెచ్చ‌రించారు. హత్యా రాజ‌కీయాల‌ను ఖండిస్తూ గురువారం డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు. పోలీసు అధికారులు సైతం శాంతిభ‌ద్ర‌త‌ల అంశాన్ని ఒక పార్టీ చేతుల్లో పెట్ట‌డం స‌రైన విధానం కాద‌న్నారు లోకేశ్‌.

అది క‌క్ష్య‌సాధింపులో భాగ‌మే..

అది క‌క్ష్య‌సాధింపులో భాగ‌మే..

క‌ర‌క‌ట్ట వ‌ద్ద ఉన్న ప్ర‌జావేదిక కూల్చివేత ప్ర‌భుత్వ తొంద‌ర‌పాటు చ‌ర్య‌గా లోకేశ్ అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఇవ‌న్నీ చేస్తోంద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు ఇంట్లో నిద్రిస్తుంటే రాత్రికి రాత్రే ప్ర‌జావేదిక కూల్చేసారి పేర్కొన్నారు. క‌ర‌క‌ట్ట మీద నిర్మాణాల్లో ఏవీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉన్నాయో..ఏవి లేవో గ్రీన్ ట్రిబ్యున‌ల్ తీర్పు చూస్తూ తెలుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. తీర్పు ప్రకారం కృష్ణా నదికి 100 మీటర్ల దూరంలో ప్రజావేదిక భవనం ఉందని గుర్తు చేశారు. కరకట్టమీదున్న నిర్మాణాలన్నీ అక్రమం కాదన్నారు లోకేవ్‌. ఇప్పుడు లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల మీద వైసీపీ ఏర‌కంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

English summary
Ex Minister Lokesh warned CM Jagan to dont test TDP cadre patience. Jagan converted Ap into Bihar in Law and order maintenance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X