• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయవాడలో మరో దారుణం : ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి... కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం...

|

బెజవాడలో దారుణం జరిగింది. తనను ప్రేమించట్లేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు.ఆపై తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్నటికి నిన్న కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన యువతిని సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే... మరో యువతి ప్రేమోన్మాది చేతిలో బలైపోవడం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

విజయవాడలోని క్రీస్తు రాజుపురానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతి మాచవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతోంది. క్రీస్తు రాజుపురానికే చెందిన చిన్నస్వామి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తేజస్విని వెంట పడుతున్నాడు. తేజస్విని పలుమార్లు చిన్నస్వామిని వారించినప్పటికీ... అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తనను ప్రేమించట్లేదన్న కారణంతో తేజస్వినిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం(అక్టోబర్ 15) ఉదయం తేజస్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లాడు. మాట్లాడాలని చెప్పి తేజస్వినిని బయటకు పిలిచాడు.

కత్తితో విచక్షణారహితంగా దాడి...

కత్తితో విచక్షణారహితంగా దాడి...

తేజస్విని బయటకొచ్చి మాట్లాడగా... మరోసారి ప్రేమ విషయాన్ని ప్రస్తావించాడు. ఎప్పటిలాగే తేజస్విని సున్నితంగా అతని ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో తేజస్వినితో వాగ్వాదానికి దిగిన చిన్నస్వామి ఆమెపై అరవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో వెంట తెచ్చిన కత్తితో ఒక్కసారిగా ఆమె మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తేజస్విని అక్కడికక్కడే కుప్పకూలింది. ఆపై చిన్నస్వామి తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు...

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు...

తేజస్విని పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు చిన్నస్వామి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన విజయవాడ మహిళా సంఘం నాయకురాలు దుర్గా భవాని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడితో మరోసారి విజయవాడ నగరం ఉలిక్కిపడిందన్నారు. ఇంటికొచ్చి మరీ యువతిపై దాడి చేశాడంటే... తననెవరూ ఏమీ చేయలేరన్న మనస్తత్వమైనా ఉండాలి లేదా వెనకాల ఎవరి అండదండలైనా ఉండి ఉండాలన్నారు. విస్సన్నపేటకు చెందిన నర్సు సజీవ దహనం ఘటనను జీర్ణించుకోకముందే మరో ఘటన జరగడం దారుణమన్నారు. పోలీసులు,ప్రభుత్వం సకాలంలో సరైన విధంగా స్పందించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. దిశ,నిర్భయ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

నర్సు సజీవదహనం మరవకముందే..

నర్సు సజీవదహనం మరవకముందే..

చదువుకున్ననవారే ప్రేమ పేరుతో ఇలాంటి దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. చిన్నప్పటినుంచే చట్టాలపై,సమాజంపై అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిలో కొంత మార్పు తీసుకురావచ్చునన్నారు.అలాగే సమస్య మూలాల్లోకి వెళ్లి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. మరో ఆడబిడ్డ ఇలాంటి ఉన్మాదాలకు బలికాకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని దుర్గా భవాని డిమాండ్ చేశారు. కాగా,విజయవాడలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని రెండు రోజుల క్రితం నాగభూషణం అనే వ్యక్తి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్న నాగభూషణం... ఆమె ఎంతకీ తన ప్రేమను అంగీకరించట్లేదన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

English summary
A man attacked a girl with knife for rejecting his love proposal,after brutal attack she was died in hospital.Victim identified as Divya Tejaswini who is studying Btech final year in Machavaram and accused identified as Chinnaswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X