విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కు అండగా ఆ ఇద్దరు... మన నుడి - మన నది ఉద్యమానికి బాసటగా

|
Google Oneindia TeluguNews

తెలుగు భాష పరిరక్షణ కోసం, నదుల పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మన నుడి - మన నది ఉద్యమానికి చాలామంది భాషావేత్తలు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయాలకతీతంగా తెలుగుజాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ముందుకు రావాలని వారంతా పిలుపునిస్తున్నారు. పలువురు ప్రముఖులు పవన్ తీసుకున్న ఈ ఉద్యమానికి తమ వంతు బాసటగా నిలుస్తామని చెప్తున్నారు.

జగన్ పై మరోసారి పవన్ ఫైర్: మాతృభాషను మృత భాషగా మార్చకండిజగన్ పై మరోసారి పవన్ ఫైర్: మాతృభాషను మృత భాషగా మార్చకండి

భాషా రక్షణ కోసం పవన్ పోరాటం.. ప్రముఖుల మద్దతు

భాషా రక్షణ కోసం పవన్ పోరాటం.. ప్రముఖుల మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూల్స్ తీసివేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి నేటి వరకు తెలుగు మీడియం స్కూల్స్ తీసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మాతృభాషని మృతభాష గా మార్చవద్దని హితవు చెబుతున్నారు. ఇక అంతే కాకుండా నదీ పరిరక్షణ, భాషా పరిరక్షణ ధ్యేయంగా ఆయన మన నుడి - మన నది ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

పవన్ పోరాటానికి అండగా జొన్నవిత్తుల, మండలి బుద్ధ ప్రసాద్ లు

పవన్ పోరాటానికి అండగా జొన్నవిత్తుల, మండలి బుద్ధ ప్రసాద్ లు

పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచారు మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌, అలాగే పాటల రచయిత జొన్నవిత్తుల. తెలుగు భాష పరిరక్షణ కోసం జనసేన పార్టీ చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని,ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. ఇటీవల హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరావుతో కలిసి బుద్దప్రసాద్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తో సమావేశమై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు .

మన నుడి - మన నది ఉద్యమంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన మండలి బుద్ధ ప్రసాద్

మన నుడి - మన నది ఉద్యమంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన మండలి బుద్ధ ప్రసాద్


తెలుగు భాషతోపాటు నదీ పరిరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై పవన్‌తో సుదీర్ఘంగా చర్చించిన వారు పవన్‌ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైనదని,అందరూ మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం చేపట్టిన మన నుడి - మన నది కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించినట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం పట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమగ్రమైన తెలుగు వ్యక్తిత్వ నిర్మాణానికి పవన్‌ చాలా కృషి చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.

 భాషాభిమానులంతా పవన్ తో కలిసి సాగాలన్న జొన్నవిత్తుల

భాషాభిమానులంతా పవన్ తో కలిసి సాగాలన్న జొన్నవిత్తుల

తెలుగు భాష అభిమానులంతా ఒక సమైక్య వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని , భాష మనుగడ ప్రశ్నార్థకం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు సైతం భాషాభిమానులంతా పవన్‌ కళ్యాణ్ తో కలిసి రావాలని జొన్నవిత్తుల ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం ఒక బలమైన సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారన్నారు.

 ప్రముఖులు బాసటగా నిలిచినా ... పవన్ చేస్తున్న ఈ ఉద్యమంలో సక్సెస్ అవుతారా ?

ప్రముఖులు బాసటగా నిలిచినా ... పవన్ చేస్తున్న ఈ ఉద్యమంలో సక్సెస్ అవుతారా ?

నదుల కాలుష్యాన్ని నివారించేందుకు పవన్ కళ్యాణ్ కంకణబద్ధులై పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం భాషా పండితులు, భాషాభిమానులు కదలిరావాలని, ప్రకృతి ప్రేమికులు సైతం పవన్కళ్యాణ్ సంకల్పానికి మద్దతుగా నిలవాలని జొన్నవిత్తుల పిలుపునిచ్చారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చేపట్టిన భాష ఉద్యమానికి, నదీ పరిరక్షణ ఉద్యమానికి పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. కానీ పవన్ ఈ ఉద్యమంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

English summary
Lyricist Jonnavithula has extended support to Jana Sena Chief Pawan Kalyan over ‘Mana Nudi... Mana Nadi’ programme that was taken up with an objective to protect Telugu language and rivers in the State. Former deputy speaker of AP Assembly Mandali Buddha Prasad has also supported Pawan Kalyan's noble move. Buddha Prasad and Jonnavithula met Jana Sena Chief Pawan Kalyan at the office in Hyderabad and stressed the need for an a political movement to save the Telugu language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X