విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రమశిక్షణ గల కార్యకర్తగా..నమ్మిన సిద్దాంతాల కోసం, మాణిక్యాలరావు సంతాప సభలో బీజేపీ నేతలు..

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి మాణిక్యాలరావు మృతి బీజేపీకి తీరని లోటు అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. మాణిక్యాలరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శనివారం విజయవాడలో మాణిక్యాలరావు సంతాప సభ జరిగింది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన సభకు సునీల్ డియేదర్, విష్ణువర్ధన్ రెడ్డి హాజరవగా.. కిషన్ రెడ్డి, మురళీధర్, జీవిఎల్, కన్నా లక్ష్మీనారాయణ, పురందరీశ్వరీ, మాదవ్ తదితరులు వీడియో ద్వారా పాల్గొని నివాళులు అర్పించారు.

నమ్మిన సిద్దాంతాల కోసం..

నమ్మిన సిద్దాంతాల కోసం..

నమ్మిన సిద్దాంతాల కోసం మాణిక్యాలరావు పని చేశారని అధ్యక్షుడు సోము వీర్రాజుతెలిపారు. మృదుస్వభావి అని గుర్తుచేశారు. దేవాదాయశాఖ మంత్రిగా చక్కగా పనిచేశారని వివరించారు. అభివృద్ది కోసం పాటుపడేవారు అని.. 1989 నుంచి బీజేపీలో ఉంటూ.. పార్టీ అభివృద్ది ఉన్నతి కోసం పని చేశారని పేర్కొన్నారు.
మాణిక్యాలరావు మరణం తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటన్నారు.

ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు

ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు

బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. పార్టీ కోసం నిబద్దతతో పనిచేశారని కొనియాడారు. తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తూనే.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అభివృద్ది కోసం పని చేశారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ది కోసం తపన పడుతుండేవారని గుర్తుచేశారు. మంత్రి వర్గంలో ఉన్నా..సీఎంను సైతం ధిక్కరించి అమిత్ షా సహకారంతో నిట్ తన నియోజకవర్గంలో కేటాయించుకున్నారని తెలిపారు.దేవాలయాల అభివృద్ది కోసం పలు కార్యక్రమాలను చేపట్టారని వివరించారు.

Recommended Video

Kozhikode:ల్యాండ్ అయ్యే ముందు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి రన్ వే పై జారీ ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం!
ఆత్మీయుడిని కోల్పోయా...

ఆత్మీయుడిని కోల్పోయా...

మాణిక్యాలరావు వంటి మంచి మనిషి పార్టీ కోల్పోవడం బాధాకరం అని మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభు అన్నారు. తనకు ఎంతో ఆత్మీయుడు అని పేర్కొన్నారు. చివరి సారి కలిసిన సమయంలో కూడా రాజకీయ అంశాలపై చర్చించుకున్నామని గుర్తుచేశారు. మంత్రిగా ఎదిగినా.. సామాన్య కార్యకర్తగానే పార్టీలో పని చేశారని తెలిపారు. అటుపోటులు ఎదుర్కొని మాణిక్యాలరావు పార్టీ కోసం పని చేశారని మురళీధరరావు తెలిపారు. మంత్రి పదవి కన్నా విలువలే మఖ్యమని, రాజీనామాకు కూడా సిద్దమని ప్రకటించారని గుర్తుచేశారు. బీజేపీ కార్యకర్త ఎలా ఉండాలో అని చెప్పేందుకు మాణిక్యాలరావు జీవితాన్ని ఉదహరించాలని చెప్పారు. సాధారణ జీవితం గడిపి.. ఉన్నతమైన లక్ష్యాల కోసం పని చేశారని పొగిడారు.

క్రమశిక్షణకు మారుపేరు

క్రమశిక్షణకు మారుపేరు

పార్టీలో మాణిక్యాలరావు చురకైన పాత్ర పోషించేవారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ది జరుగుతుందని మాణిక్యాలరావు చెబుతుండే వారని గుర్తుచేశారు. మాణిక్యాలరావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాణిక్యాలరావు సిద్దాంతాలను ముందుకు తీసుకెవళ్లడమే..ఆయనకు మనం ఇచ్చే నివాళి అని కిషన్ రెడ్డి అన్నారు.

English summary
manikyala rao is disciplined worker, bjp leaders praised his service to party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X