విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు సవాల్ చేసిన మంత్రి బొత్సా ... ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకమని చెప్పే ధైర్యం ఉందా?

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా అంటూ ఫైర్ అయ్యారు.

రాజధానిపై త్వరలో సీఎం జగన్ ప్రకటన : బొత్సా స్పష్టీకరణరాజధానిపై త్వరలో సీఎం జగన్ ప్రకటన : బొత్సా స్పష్టీకరణ

 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చారిత్రక అవసరం అన్న మంత్రి బొత్సా

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చారిత్రక అవసరం అన్న మంత్రి బొత్సా

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చారిత్రక అవసరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇంగ్లీషు మీడియం చదువులకు, మత మార్పిడులకు లింకు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అతిపెద్ద సంస్కరణల్లో భాగమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల లాభం జరుగుతుంది కాబట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ఇంగ్లీష్ మీడియం చదువులకు మత మార్పిడులకు సంబంధం ఏంటి అని ప్రశ్నించిన మంత్రి

ఇంగ్లీష్ మీడియం చదువులకు మత మార్పిడులకు సంబంధం ఏంటి అని ప్రశ్నించిన మంత్రి

ఇక అంతే కాదు ఇంగ్లీష్ మీడియం చదువుల పై ఇంత రచ్చ చేస్తున్న చంద్రబాబు తాము ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం అని ధైర్యంగా చెప్పగలరా అని సవాల్ చేశారు బొత్సా . ఇంగ్లీష్ మీడియం చదువు పై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు అవివేకంతో మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. అసలు ఇంగ్లీష్ మీడియం చదువులకు, మతమార్పిడులకు గల సంబంధం ఏంటి అని బొత్స సత్యనారాయణ గట్టిగా ప్రశ్నించారు.

సింగపూర్ తో రాజధాని ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నామన్న మంత్రి బొత్సా

సింగపూర్ తో రాజధాని ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నామన్న మంత్రి బొత్సా

ఇక అంతే కాదు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో సింగపూర్ రాజధాని ఒప్పందాన్ని విరమించుకున్నాం అని చెప్పిన బొత్స సత్యనారాయణ ఈ విరమణ వల్ల పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. చంద్రబాబు పాలసీలను ప్రజలు తిరస్కరించారని, ఇక వాటిని అమలు చేయాలని కోరడం దివాలాకోరుతనమని చంద్రబాబుపై ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ.

అప్పుల రాష్ట్రం అయినా అభివృద్ధిలో ముందుకే వెళ్తున్నాం అని మంత్రి స్పష్టీకరణ

అప్పుల రాష్ట్రం అయినా అభివృద్ధిలో ముందుకే వెళ్తున్నాం అని మంత్రి స్పష్టీకరణ

రాష్ట్రానికి 2.60 లక్షల కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు పుణ్యమేనని విమర్శించిన బొత్స సత్యనారాయణ అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు చేయడంలో వైయస్ జగన్ ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు కితాబిచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లాలో మరో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.

 ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించాలని సవాల్ చేసిన మంత్రి

ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించాలని సవాల్ చేసిన మంత్రి

అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పలు హామీలను అమలు చేశామని పేర్కొన్న బొత్స సత్యనారాయణ కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఓర్చుకోలేక ప్రతిదీ రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. మాతృభాష అయిన తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో.. అంతే మనిషి మనుగడకు, జీవన ఉపాధి కల్పించడానికి అవసరమైన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాల్సిన అవసరం అంత ఉందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మొత్తానికి ఈ రాద్దాంతానికి చెక్ పెట్టడానికి ఇంగ్లీష్ మీడియం వద్దంటే తాము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకమని ప్రకటించాలని చంద్రబాబు కు సవాల్ విసిరారు.

English summary
Chandra Babu, who is doing so much on English Medium, challenged him to say that he is brave against the English Medium. He was adamant that the opposition parties who were doing the meddling in English medium education were talking foolishly. Botsa Satyanarayana has strongly questioned the relationship of the English medium students and the religious convertions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X