విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ పుంజుకుంటే మాయ ,మోసం ,దగాతోనే .. చంద్రబాబుది అంకెల గారడీ : మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు గురి చేస్తున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలలో టిడిపి మద్దతుదారులు విజయం సాధిస్తున్నారని టిడిపి నేతలు చెప్పుకుంటుంటే, టిడిపి మద్దతుదారులు గెలిచిన స్థానాలలో మాయ, మోసం , దగాలతో విజయం సాధించారని వైసిపి నాయకులు మండిపడుతున్నారు.

పంచాయతీ పోరు .. బొత్సా టార్గెట్ గా విజయనగరం వైసీపీలో ఇంటర్నల్ వార్ .. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఫైర్ పంచాయతీ పోరు .. బొత్సా టార్గెట్ గా విజయనగరం వైసీపీలో ఇంటర్నల్ వార్ .. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఫైర్

టిడిపి పరిస్థితి 0 నుండి 0.01కి వస్తే దాన్ని పుంజుకోవడం అనుకుంటే అభ్యంతరం లేదు

టిడిపి పరిస్థితి 0 నుండి 0.01కి వస్తే దాన్ని పుంజుకోవడం అనుకుంటే అభ్యంతరం లేదు


తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైసిపి పనైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారని, కానీ వాస్తవానికి వారి పార్టీ పని అయిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టిడిపి పరిస్థితి 0 నుండి 0.01కి వస్తే దాన్ని పుంజుకోవడం అని చంద్రబాబు అనుకుంటే తమకు అభ్యంతరం లేదని వ్యంగ్యంగా స్పందించారు. టిడిపి నేతలు చెప్పినట్లుగా టిడిపి పుంజుకుంటే మాయ, మోసం, దగాల తోనే పుంజుకుంటుంది అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

 మొదటి ,రెండో విడత ఎన్నికలలో వైసిపి మద్దతుదారులు అత్యధిక స్థానాలలో విజయం

మొదటి ,రెండో విడత ఎన్నికలలో వైసిపి మద్దతుదారులు అత్యధిక స్థానాలలో విజయం

మొదటి ,రెండో విడత ఎన్నికలలో వైసిపి మద్దతుదారులు అత్యధిక స్థానాలలో విజయం సాధించారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నేతలు అంకెల గారడీ చేస్తున్నారంటూ విమర్శించారు.

ఇప్పటివరకు జరిగిన రెండు విడతలలోనూ వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందని పేర్కొన్న బొత్స సత్యనారాయణ, రెండో విడత ఎన్నికలలోనూ 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఏకగ్రీవాలతో కలిపి వైసిపి 2639, టిడిపి 536, బిజెపి 6, జనసేన 36, వైసిపి రెబల్స్ మిగిలినవారు కలిపి 108 మంది గెలిచారని పేర్కొన్నారు .

వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారు

వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారు

వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు గారడీ చేస్తున్నారని, తప్పుగా లెక్కలు చెబుతున్నారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికలలో వైసిపి మద్దతుదారుల విజయం సాధించే శాతం ఖచ్చితంగా పెరుగుతుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు రోజుల్లో రెండో విడత వైసీపీ మద్దతుదారులు గెలుపొందిన జాబితాను మీడియాకు విడుదల చేస్తామని పేర్కొన్నారు బొత్ససత్యనారాయణ

Recommended Video

#TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections
ఎల్లుండి మూడో విడత ఎన్నికలు .. పెరుగుతున్న మాటల వేడి

ఎల్లుండి మూడో విడత ఎన్నికలు .. పెరుగుతున్న మాటల వేడి


ఇదిలా ఉంటే రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ , ప్రతిపక్ష టీడీపీ సమాయత్తం అవుతున్నాయి . ఈ నెల్ 17 న జరగనున్న మూడో విడత ఎన్నికల్లో సత్తా చాటాలని తెగ తాపత్రయపడుతున్నాయి. ఈ మేరకు గ్రామాలలో ఎవరి వ్యూహాలలో వారున్నారు. ఇప్పటికే మూడో విడత ఎన్నికల్లోనూ మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవాలు చెయ్యాలని వైసీపీ , ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ ప్రయత్నాలు సాగించాయి. మరో రెండు రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మాటల దాడి పెంచారు .

English summary
Minister Botsa Satyanarayana responded sarcastically that he had no objection, if Chandrababu thought the TDP situation would recover if it went from 0 to 0.01. Botsa Satyanarayana criticized that if the TDP recovers, it will recover with deceit, fraud and deception..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X