విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కు స్థలం..చంద్రబాబుకు ఇల్లు ఇచ్చింది ఒక్కరే : టీడీపీ 2గా జనసేన: బొత్సా ఫైర్..!!

|
Google Oneindia TeluguNews

తన మీద విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి బొత్సా సీరియస్ గా స్పందించారు. జనసేన పార్టీ టీడీపీ 2గా మారిందని ఆరోపించారు. రాజధాని పేరుతో అవినీతి జరిగినా మాట్లాడని పవన్ కళ్యాణ్..ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయటం ద్వారా ఆయన వైఖరి స్పష్టమవుతెందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు...పవన్ కళ్యాణ్ కు జాగా రెండూ ఒకే వ్యక్తికి చెందినవని గుర్తు చేసారు. రాజధాని అవినీతి గురించి తేల్చిన తరువాతనే పనులు తిరిగి ప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు. టీడీపీ దోపిడీలో జనసేనకు భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని బొత్సా ఆరోపించారు. పవన్ లాంటి వారు ఉన్నంతకాలం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ..షా అనుకుంటే ఏదైనా చేస్తారా..చట్టాలు న్యాయస్థానాలు లేవా అంటూ వవన్ తన పైన చేసిన వ్యాఖ్యల మీద బొత్సా ఫైర్ అయ్యారు.

పవన్ కు చంద్రబాబుకు బర్త్ డే విషెస్: ప్రాణ స్నేహితుడి వర్ధంతిని విస్మరించారెందుకంటోన్న ఫ్యాన్స్పవన్ కు చంద్రబాబుకు బర్త్ డే విషెస్: ప్రాణ స్నేహితుడి వర్ధంతిని విస్మరించారెందుకంటోన్న ఫ్యాన్స్

టీడీపీ అవినీతిలో జనసేనకు భాగస్వామ్యం ఉందా..
మంత్రి బొత్సా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద స్పందించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిలో జనసేనకు భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎన్నికల ముందు రాజధాని లో 36 వేల కోట్ల పనులకు నిర్ణయం తీసుకున్నారని..వాటి పైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత కొత్త పనులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు. రాజధాని అంశంలో టీడీపీ వాదనే జనసేన చేస్తూ ఆ పార్టీ టీడీపీ 2గా మారిందని విమర్శించారు. టీడీపీ హాయంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతుంటే పవన్ ముఖ్యమంత్రిని తప్పు బడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒక్క రాజధాని వెయ్య కుంభ కోణాల తరహాలో అవినీతి జరిగిందని...దీనిలోని భాగస్వాములకే ఇప్పుడు ఆందోళన మొదలైందని విమర్శించారు. ఏ విషయంలో ఎన్నడూ టీడీపీని ప్రశ్నించని జనసేన..ఇప్పటికీ టీడీపీనే సమర్ధిస్తోందని ఆరోపించారు. రాజధాని అవినీతి పైన వాస్తవాలు తేలిన తరువాతనే కొత్త పనుల గురించి నిర్ణయం ఉంటుందని బొత్సా స్పష్టం చేసారు.

Minister Botsa seriously reacted on Pawan Kalyan comments on CM Jagan and his administration

మోదీ..షా అనుకుంటే ఏదైనా చేస్తారా..
తన మీద వోక్స్ వ్యాగన్ కేసు గురించి పవన్ ప్రస్తావించి..అవినీతి విషయంలో మోదీ..షా సీరియస్ గా ఉన్నారంటూ పరోక్షంగా హెచ్చరించారు. దీని పైన స్పందించిన బొత్సా వోక్సా వ్యాగన్ కేసులో తాను సాక్షి మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ..షా అనుకుంటే ఏదైనా చేస్తారా..చట్టాలు.. న్యాయ స్థానాలు లేవా అంటూ బొత్సా ప్రశ్నించారు. రాజధాని మీద మంత్రి బొత్సా వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళంతో అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా పవన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. అదే సమయంలో అనేక కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టిన బొత్సా రాజధాని అమరావతిలో కొనసాగుతుందా లేదా అనే విసయం పైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ..అమిత్ షా పేర్లు ప్రస్తావించి బొత్సాను హెచ్చరించే ప్రయత్న చేసారు. వారిద్దరి కన్నా శైసీపీ మీద ఉందని..జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యల మీద బొత్సా మాత్రమే ఇప్పటి వరకు స్పందించారు. ఈ నెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రాజధాని విషయం మీద మంత్రులకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

English summary
Minister Botsa seriously reacted on Pawan Kalyan comments on CM Jagan and his administration. Botsa says that Chandra Babu house and Pawan Land in Amaravati belongs to same person. Janasena became TDP 2 in ap plitics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X