విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రథం దగ్ధం అయితే చంద్రబాబు ఆనంద తాండవం చేస్తున్నారు .. మంత్రి కన్నబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఆలయాలను కూలగొట్టించలేదా అంటూ ప్రశ్నించారు. నాడు చంద్రబాబు జేసీబీలతో ఆలయాలను కూల్చిన రోజు ఏం చేశారని కన్నాబాబు ప్రశ్నించారు . అంతర్వేదిలో రథం దగ్ధం అయితే చంద్రబాబు ఆనందతాండవం చేస్తున్నారంటూ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు .

నాడు ఆలయాల కూల్చివేత సమయంలో హిందుత్వం గుర్తుకు రాలేదా ?

నాడు ఆలయాల కూల్చివేత సమయంలో హిందుత్వం గుర్తుకు రాలేదా ?

నాడు చంద్రబాబు ఆలయాల విషయంలో దారుణాలకు పాల్పడితే హిందుత్వం గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు కన్నబాబు.

అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ప్రతిపక్ష పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించినప్పటికీ రాద్ధాంతం చేయడం పద్ధతి కాదని విమర్శించారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కురసాల కన్నబాబు మండిపడ్డారు. కులాలను అడ్డంపెట్టుకుని రాజకీయం చేసిన చంద్రబాబు, ఇప్పుడు మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ కన్నబాబు ఫైర్ అయ్యారు.

చంద్రబాబు తానింకా ప్రభుత్వాన్ని నడుపుతున్న భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా

చంద్రబాబు తానింకా ప్రభుత్వాన్ని నడుపుతున్న భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా


సీఎం జగన్ ఢిల్లీ టూర్ విషయంపై టీడీపీ అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తానింకా ప్రభుత్వాన్ని నడుపుతున్న భ్రమల్లో ఉన్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. అమిత్ షా,సీఎం జగన్ కలయిక వెనుక ఇష్టారాజ్యంగా టిడిపి నేతలు వ్యాఖ్యలు చేయడం పై ఆయన మండిపడ్డారు.
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కష్టపడకుండా పలు పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు కన్నబాబు.

Recommended Video

#Watch AP CM YS Jagan's Lotus Pond ముట్టడి, Bajrang Dal Activists నిరసనలు....!! || Oneindia Telugu
త్వరలో ఆహార శుద్ధి పాలసీ ప్రకటిస్తామన్న మంత్రి కన్నబాబు

త్వరలో ఆహార శుద్ధి పాలసీ ప్రకటిస్తామన్న మంత్రి కన్నబాబు

ఆయిల్ ఫామ్ పంట కొనుగోళ్లను టన్నుకు 11000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.ఆయిల్ ఫామ్ ధరలకు ఏపీకి తెలంగాణాకి ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం 80 కోట్ల రూపాయలను కేటాయించామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామనికన్నాబాబు పేర్కొన్నారు. త్వరలో ఆహార శుద్ధి పాలసీ ప్రకటిస్తామన్న కన్నాబాబు వ్యవసాయ , వ్యవసాయ అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోకి తెస్తామని ప్రకటించారు . మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని, వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చెయ్యటం ద్వారా రైతులకు మరింత లబ్ది చేకూరుతుంది అని చెప్పారు .

English summary
Minister Kursala Kannababu was angry with TDP chief Chandrababu NaiduMinister Kannababu fired as Chandrababu was rejoicing while the antarvedi chariot was burnt. he questioned about the demolitions of temples in chandrababu's regime .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X