• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దేవినేని ఉమా బ్రోకర్ .. వదినను ఎందుకు చంపాడు .. మరోమారు రెచ్చిపోయిన మంత్రి కొడాలి నానీ

|

కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఇక అంతే కాదు రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో విపరీతంగా పెరిగాయని దేవినేని ఉమా మాట్లాడారు. దేవినేని ఉమా వ్యాఖ్యలపై మరోమారు విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. '

టీటీడీపై కొడాలి నానీ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించటం లేదు: దేవినేని ఉమా ఫైర్

దేవేనేని ఉమాపై నిప్పులు చెరిగిన కొడాలి నానీ

దేవేనేని ఉమాపై నిప్పులు చెరిగిన కొడాలి నానీ

చంద్రబాబు బ్రోకర్ దేవినేని ఉమా అంటూ నిప్పులు చెరిగారు. మద్యం విషయంలో గతంలో కూడా దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారని జగన్ కు నచ్చిన బ్రాండ్లను మాత్రమే మద్యం షాపులలో విక్రయిస్తున్నారని, దాంతో కమీషన్ల దందా చేస్తున్నారని పేర్కొన్నారని చెప్పిన కొడాలి నాని కళ్ళజోడు లేకుండా చూడాలని గుడ్డోడు చంద్రబాబు, పప్పు నాయుడు, అలాగే దేవినేని ఉమాలు ఏ బ్రాండ్ తాగుతారో చెప్పాలని అడిగితే దేవినేని సమాధానం చెప్పలేకపోయారన్నారు.

పదవి కోసం వదిననే చంపాడని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి

పదవి కోసం వదిననే చంపాడని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి

ఇక ఇదే క్రమంలో మరోమారు దేవినేని ఉమా చంద్రబాబు బ్రోకర్, చంద్రబాబును వాడు వీడు అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఇక అంతే కాదు ఇప్పటివరకు వదినని ఎందుకు చంపావు అంటే దేవినేని ఉమ సమాధానం చెప్పలేక పోతున్నారని కొడాలి నాని తనదైన శైలిలో మాట్లాడారు. వదినను పదవి కోసం చంపిన ఉమా, మంత్రిగా ఉన్నప్పుడు బ్రోకర్ పనులు చేశాడని, కమీషన్లు తీసుకెళ్లి పప్పు నాయుడుకి, వాడి బాబుకి ఇచ్చాడని పరుష పదజాలంతో మాట్లాడారు. అందుకే చంద్రబాబు బ్రోకర్ లా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు కొడాలి నాని.

చంద్రబాబు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిన పనికిమాలిన దద్దమ్మ అని ఫైర్

చంద్రబాబు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిన పనికిమాలిన దద్దమ్మ అని ఫైర్

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు కమీషన్లు తీసుకున్న ఉమా కు అందరూ కమీషన్లు తీసుకున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా బదులిచ్చారు మంత్రి కొడాలి నానీ. ఎన్టీఆర్ నాడు మద్యపాన నిషేధాన్ని పెడితే పనికిమాలిన దద్దమ్మ అయిన చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చాడని నిప్పులు చెరిగారు కొడాలి నాని. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరిగి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే దానికి సహకరించాల్సింది పోయి విమర్శలు గుప్పిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యుల పేరు వాడుకోని వారుంటే చెప్పాలని సవాల్

టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యుల పేరు వాడుకోని వారుంటే చెప్పాలని సవాల్

నాడు ఎన్టీఆర్ కమీషన్ల కోసం మద్యపాన నిషేధం అమలు చేస్తే, నేడు జగన్ మోహన్ రెడ్డి కూడా అలాగే చేసాడు అనుకోవాలని టిడిపి నేతలకు సమాధానమిచ్చారు. ఇక అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా వాడుకుంది కొడాలి నాని, వల్లభనేని వంశీ అన్న వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన నాని తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేరును వాడుకోని నాయకులు ఎవరైనా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు వల్ల రాజకీయంగా ఎవరు ఎదిగారో చెప్పాలన్న నానీ

చంద్రబాబు వల్ల రాజకీయంగా ఎవరు ఎదిగారో చెప్పాలన్న నానీ

నందమూరి కుటుంబం వల్ల లాభం పొందని మగాళ్ళు ఎవరైనా టీడీపీలో ఉంటే, కేవలం చంద్రబాబు వల్లే లబ్ధి జరిగిందన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ కొడాలి నాని మాత్రం టిడిపి నేతల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. అసభ్య పదజాలంతో దూషించడం ఆపటం లేదు. ఇక వైసిపి వర్సెస్ టీడీపీ నేతల బూతుల పురాణం భవిష్యత్తులో ఏ రూపు తీసుకుంటుందో అన్న అనుమానం కలుగుతుంది. నేతల బూతుల తీరు ప్రజలకు విస్మయం కలిగిస్తుంది.

English summary
The latest remarks made by AP Minister Kodali Nani on Chandrababu Naidu and TDP leaders have been the subject of AP politics. Speaking with no filtered mouth, making personal slander.Devineni Uma is nothing but Chandrababu's Broker Nani said. Kodali Nani spoke in his own style, saying that Uma is unable to answer the murder of his brother's wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more