• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నువ్వో బ్రోకర్‌వి,దళారివి... పిచ్చి పిచ్చిగా వాగితే తాట తీస్తాం.. చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్...

|

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం,70ఏళ్ల వయసున్న చంద్రబాబు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడు వీడు అని మాట్లాడటం ఆయన సంస్కారాన్ని తెలియజేస్తోందన్నారు. నోరు ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగితే తాట తీస్తామని హెచ్చరించారు. చంద్రబాబుదీ ఓ బతుకేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దానిపై స్పీకర్‌ను అడుగు...

దానిపై స్పీకర్‌ను అడుగు...

'అసెంబ్లీ అనేది స్పీకర్ అధ్యక్షతన రూల్స్ ప్రకారం నడుస్తుంది. అంతేగానీ జగన్ ఆలస్యంగా వచ్చినందుకే సభ ఆలస్యంగా మొదలైందని మాట్లాడమేంటి..? సభ ఆలస్యమైతే... స్పీకర్‌ను అడుగు... చంద్రబాబు సభలో బైఠాయించింది రైతుల కోసం కాదు... ఆయనకు మాట్లాడే సమయం ఇవ్వనుందుకు.. చంద్రబాబు రైతులను ముంచే బ్రోకర్.. రైతుల వద్ద తక్కువ ధరకు పాల ఉత్పత్తులను కొనుగోలు చేసి హెరిటేజ్‌లో ఎక్కువ ధరకు అమ్ముకుంటుంటాడు.' అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రోకర్,దళారీ అంటూ విమర్శలు...

బ్రోకర్,దళారీ అంటూ విమర్శలు...

హెరిటేజ్ ఆదాయం రూ.10వేల కోట్లుకు ఎలా పెరిగిందని కొడాలి నాని ప్రశ్నించారు. బ్రోకర్ పనులు చేస్తేనే అంత ఆదాయం వస్తోందని విమర్శించారు. చంద్రబాబు రైతుల కష్టాలను దోచుకునే దళారీ,బ్రోకర్ అని విమర్శించారు. రైతులను కాపాడేందుకే అసెంబ్లీ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేశామన్నారు. పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని గతంలోనే సభలో చర్చించి కౌన్సిల్‌కు పంపితే... దానిపై మళ్లీ సభలో చర్చ జరగాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి ఉండటం వల్లే గతంలో జరిగినవి మరిచిపోతున్నారని విమర్శించారు.

ఆ ఇద్దరి చావులకు కారణం నువ్వే..?

ఆ ఇద్దరి చావులకు కారణం నువ్వే..?

పరిటాల రవి.. ఎన్టీఆర్ చావులకు కారణం చంద్రబాబు కాదా..? అని కొడాలి నాని ప్రశ్నించారు. గతంలో రామానాయుడు స్టూడియో వద్ద పరిటాల రవిని చంపేందుకు జరిగిన పేలుడుకు చంద్రబాబే కారణమా..? నోరు ఉంది కదా గాలి మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని విమర్శించారు. ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు వస్తే... తనవల్లే వ్యాక్సిన్ తయారుచేశారని చంద్రబాబు గొప్పలు పోతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని... వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలను కూడా మంజూరు చేశారని గుర్తుచేశారు. ఒక్క రైతు భరోసా ద్వారానే రూ.13వేల కోట్లు రైతులకు ఇచ్చామన్నారు.

రిటైర్ అవ్వాలని మంత్రి సలహా...

రిటైర్ అవ్వాలని మంత్రి సలహా...

ముఖ్యమంత్రిని సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడటం సరికాదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు కాదన్నారు. మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారని.. మరి ఖర్జూర నాయుడు రాజ్యాంగం కావాలా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నేత సంస్కారం ఇదేనా అని నిలదీశారు. 9,10 నెలల నుంచి హైదరాబాద్‌లో నిద్రపోతున్న చంద్రబాబుకి ఏపీ ప్రజల సమస్యలు ఇప్పుడు గుర్తొచ్చాయని అన్నారు. చంద్రబాబు చెప్పినదల్లా వినడానికి ఇవేమీ టీడీపీ సమావేశాలు కాదన్నారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని... ఇకనైనా ఆయన్ను రాజకీయాల్లో నుంచి రిటైర్ అయిపోమని ఆయన కుటుంబం చెప్పాలన్నారు.

English summary
Ap minister Kodali Nani warned TDP chief Chandrababu Naidu that dont talk rubbish against CM Jagan.He criticised that CBN is suffering from Alzheimer's disease thats why he is not remembering anything happened in the past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X