విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా కోసం హోరెత్తిన ఏపి : అన్ని చోట్లా బంద్ ప్ర‌భావం : ఒక్క‌టైన ఉద్య‌మ‌కారులు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీలో కొనసాగుతున్న బంద్... వైసీపీ, జనసేన దూరం..!!

ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాలంటూ బంద్ కు పిలుపునిచ్చారు. ఏపి లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ ప్ర‌భావం క‌నిపించింది. హోదా సాధాన స‌మితి...సిపిఐ నేత‌లు రోడ్ల పైకి వచ్చి బ‌స్సుల‌ను అడ్డ‌కున్నారు. విద్యా వ్యాపార సంస్థ‌ల‌ను స్వ‌చ్చందంగా ముసివేసారు. ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మ‌కారులు నినాదాలు చేసారు.

విజ‌య‌వాడ కేంద్రంగా..
విజ‌య‌వాడ కేంద్రంగా ఉద‌యాన్నే సిపిఐ, ప్ర‌త్యేక హోదా సాద‌న స‌మితి, కాంగ్రెస్, లోక్‌స‌త్తా నేత‌లు కార్య‌కర్త‌ల‌తో క‌లి సి నెహ్రూ బ‌స్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. బ‌స్ స్టేష‌న్ ముందు బైఠాయించారు. బ‌స్సుల‌ను బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకు న్నారు. ప్ర‌త్యేక హోదా ఏపి హ‌క్కు అంటూ నినాదాలు చేసారు. రోడ్ల పై ప‌డుకొని నిర‌స‌న తెలియ‌చేసారు. బ‌స్సుల‌ను అడ్డుకోవ‌టంతో పోలీసులు బ‌స్సుల రూట్ల‌ను మార్చి పంపారు. ఏపిలో ప్ర‌భుత్వ‌..ప్రయివేటు విద్యా సంస్థ‌ల‌ను స్వ‌చ్చం దంగా మూసివేసారు. వ్యాపార సంస్థ‌ల సైతం మ‌ద్ద‌తు గా నిల‌చాయి. ప్ర‌భుత్వం అనేక ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. విజ‌య‌వాడ‌లోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉద్య‌మ కారులు ఉద‌యం నుండే రోడ్ల పైకి వ‌చ్చి బంద్ నిర్వ హించారు. ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు. ఏపికి హోదా ప్ర‌క‌టించ‌కుండా ఏపి లో మోదీ కాలు పెట్టే హ‌క్కు లేదంటూ నిన‌దించారు.

Mixed Response for AP Bandh : Demanded Special Status..

100 రోజుల్లో హోదా ఇస్తాం.
ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట‌లో ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల‌ని..ఈ పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసే లోగా నిర్ణ‌యం తీసు కోవాల‌ని ఉద్య‌మ నేత‌లు డిమాండ్ చేసారు. ఏపి పిసిపి చీఫ్ ర‌ఘువీరా ప్ర‌ధాని మోదీ పై విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌కుండా ప్ర‌ధానికి ఏపిలో ప‌ర్య‌టించే హ‌క్కు లేద‌న్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత రాహుల్ ఇచ్చిన హామీ మేర‌కు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల్లోగా ఏపికి ప్ర‌త్యేక హోదాకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ర‌ఘువీరా స్ప‌ష్టం చేసారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత చ‌ల‌సాని శ్రీనివాస రావు ల‌క్ష్యం సాధించే వ‌ర‌కూ పోరాటం కొన సాగిస్తామ‌న్నారు. బంద్ కు దూరంగా ఉన్న పార్టీల‌ను తాము నిందించ‌టం లేద‌ని..అంద‌రినీ క‌లుపుకుకొని పోయి ఉద్య‌మం కొన‌సాగిస్తామ‌న్నారు. కెసిఆర్ హోదాకు మ‌ద్ద‌తు ఇస్తే స్వాగ‌తిస్తామ‌ని చెప్పారు.

English summary
AP Bandh on demand of Special status for AP impact over all state. Transport, schools, shops totally closed. Political parties and Hoda sadana samithi participated in Bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X