విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాన... ఒకేదగ్గర అభివృద్ది ఎందుకని ప్రశ్న..?

|
Google Oneindia TeluguNews

రాజధాని నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో మరోసారి వాడివేడి చర్చ కొనసాగింది. చర్చలో భాగంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేంద్రీకృతం కాకుండా నిర్మాణాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ది అంతా ఒకే ప్రాంతంలో జరగడం వల్ల మరో తెలంగాణ ఉద్యమం పునరావృతం అయ్యె అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

లిక్కర్ బ్రాండ్స్ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా ఎమ్మెల్యేకి ట్రోల్స్: అసెంబ్లీలో ఆదిరెడ్డి భవానీ ఉద్వేగంలిక్కర్ బ్రాండ్స్ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా ఎమ్మెల్యేకి ట్రోల్స్: అసెంబ్లీలో ఆదిరెడ్డి భవానీ ఉద్వేగం

రాజధాని నిర్మాణంపై వాడివేడి చర్చ

రాజధాని నిర్మాణంపై వాడివేడి చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై మరోసారి అసెంబ్లీలో కీలక చర్చ కొనసాగింది. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష టీడీపీ గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చెబుతున్నట్టుగా రాజధాని నిర్మాణాలు ఒకే ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడ కొనసాగించాలని కోరారు. అప్పుడే వెనకబడిన ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని ఆయన చెప్పారు. లేదంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమం వలే మరో ఉద్యమం వెల్లువెత్తే అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

 శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలను అన్యాయం జరిగింది..

శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలను అన్యాయం జరిగింది..

ఇక గతంలో రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అభివృద్ది అంతా కేంద్రీకృతం చేసిందని ఆయన ఆరోపణలు చేశారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ది చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వెనకబడిన శ్రీకాకుళం తోపాటు రాయలసీమ ప్రాంతాలను పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ హయాంలో రెండు ప్రాంతాలకు ఒక్క ప్రాజెక్టు అయినా ఇచ్చారా అంటూ ఆయన నిలదీశారు. ఈ ప్రాంతాలు ఒక్క ప్రాజెక్టు పెట్టడానికి కూడ అర్హత కలిగి లేవా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఇలాంటీ పొరపాట్లు జరగకుండా ప్రస్తుతం ప్రభుత్వం చూడాలని ఆయన కోరారు.

రాజధాని నిర్మాణంపై చంద్రబాబు మాయ చేశారు

రాజధాని నిర్మాణంపై చంద్రబాబు మాయ చేశారు

ఇక ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేశారని, దీంతోపాటు గందరగోళానికి గురి చేశారని అన్నారు. ఆయన చుట్టు పారీశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఉన్నారని, అందుకే వారి అలోచనలు బట్టే చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం సినిమావాళ్లను ఉపయోగించి ప్లాన్ చేయడం అంత్యంత దారుణం అని దుయ్యబట్టారు. ఇక ధర్మాన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కాని స్పీకర్ అందుకు అవకాశం ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ నిర్ణయమా.. వ్యక్తిగత అభిప్రాయమా...?

ప్రభుత్వ నిర్ణయమా.. వ్యక్తిగత అభిప్రాయమా...?


ధర్మాన ప్రసాదరావు మాజీమంత్రితో పాటు సీనియర్ నాయకుడిగా సభలో వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆలోచనలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే చర్చ కొనసాగుతోంది. ప్రజల అవసరాల కోసం అన్ని నిర్మాణాలను ఒకే దగ్గర నిర్మాణాలు చేయకుండా...అసెంబ్లీ, సెక్రటేరీయట్, హైకోర్టు లాంటీ భవనాలు పలు ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలోనే అదేస్థాయిలో ఆయా జిల్లాల నుండి డిమాండ్స్ కూడ వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా వెనకబడిన ప్రాంతానికి చెందిన ధర్మానతో ఈ వ్యాఖ్యలు చేయించడం ద్వార ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పిందా... లేక ఆయన వ్యక్తిగతంగా సభలో మాట్లాడారా అనేది ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి తేలనుంది.

English summary
MLA Dharmana PrasadRao made key comments on ap capital part of the debate on the capital in the AP Assembly.he wants decentralised state development
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X