విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కి నాకు మధ్య ‘అడ్డంకి’: జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మధ్య దూరం పెరిగిందా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాపాకే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. తాజాగా, అసెంబ్లీ జగన్ సర్కారుకు మద్దతు పలికి మరోసారి జనసేనతోపాటు టీడీపీకి షాకిచ్చిరు రాపాక.

జగన్ రెడ్డి! అప్పుడేమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?: రైతుకు కులమా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహంజగన్ రెడ్డి! అప్పుడేమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?: రైతుకు కులమా? అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం

పవన్‌కు నాకు మధ్య అడ్డంకి..

పవన్‌కు నాకు మధ్య అడ్డంకి..

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి, తనకు మధ్యలో అడ్డంకి ఉందని రాపాక వరప్రసాద్ తెలిపారు. త్వరలోనే తమ మధ్య ఆ అడ్డంకి తొలుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

అందుకే స్వాగతించా..

అందుకే స్వాగతించా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందులు తనకు తెలుసునని రాపాక చెప్పుకొచ్చారు. చాలా మంది దళితులు ప్రైవేటు పాఠశాలల్లో చదవలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని తెలిపారు. ఈ విషయంలో జగన్ సర్కారుకు మద్దతుగా నిలిచానని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో కమ్యూనికేషన్ ప్రాబ్లమే..

పవన్ కళ్యాణ్‌తో కమ్యూనికేషన్ ప్రాబ్లమే..

జనసేన పార్టీకి తనకు మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. దానిని సరి చేసుకుంటానని రాపాక తెలిపారు. తనలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసివుంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం తాను కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే, గతంలో కూడా జగన్ సర్కారు పథకాలకు మద్దతుగా నిలిచారు రాపాక, ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన వైఖరి ఇప్పుడు జనసేనలో చర్చనీయాంశంగా మారింది.

అడ్డంకి ఏంటి..

అడ్డంకి ఏంటి..


కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మాతృ భాష తెలుగును కాపాడుకునేందుకు తమ పోరాటం ఆగదని చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులకు తాము వ్యతిరేకం కాదని, అయితే, తెలుగును కాపాడుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు భిన్నంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వెళ్లడం గమనార్హం. రాపాక చెప్పిన ఆ అడ్డంకి ఏంటనేది ఇప్పుడు జనసేన పార్టీలో చర్చకు దారితీసింది.

English summary
mla rapaka varaprasad interesting comments on Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X