మరోసారి స్టీరింగ్ పట్టిన రోజా: 108 అంబులెన్స్ డ్రైవ్.. 10 అంబులెన్స్‌లు..
ఎమ్మెల్యే రోజా.. ఏం చేసినా సెన్సేషనే... నిత్యం ప్రజలతో మమేకమే సమస్యలను పరిష్కరించడమే కాదు.. సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ఇక పలు పథకాలు ప్రారంభించిన సమయంలో అంబులైన్స్ బైక్, అంబులెన్స్ నడిపారు. ఇప్పుడు తాజాగా మరోసారి అంబులెన్స్ డ్రైవ్ చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు జీటీవీ యాజమాన్యం 10 అంబులెన్స్‌లను మంగళవారం అందజేసింది. వీటిని మంత్రి పేర్ని నానితో కలిసి రోజా ప్రారంభించారు. తర్వాత అంబులెన్స్ మరోసారి నడిపాచరు.

పేదలకు వైద్యం..
దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ పేదలకు వైద్యం అందిస్తున్నారని రోజా ప్రశంసించారు. కరోనా నియంత్రణలో దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సీఎం జగన్ చేస్తోన్న ప్రయత్నానికి సహాయపడుతూ అంబులెన్స్‌లు అందించడం సంతోషంగా ఉంది అని మంత్రిపేర్ని నాని అన్నారు. కరోనా నియంత్రణ కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

108 వాహనం డ్రైవ్
ఇంతకుముందు కూడా 108 వాహనాన్ని నడిపారు ఎమ్మెల్యే రోజా. సీఎం జగన్ 1088 కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి ఐదు 104, ఐదు 108 వాహనాలను కేటాయించారు. నగరిలో అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గజమాలతో నివాళి అర్పించారు. తర్వాత సైరెన్ మోగిస్తూ స్వయంగా 108 వాహనాన్ని నడిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

బైక్ అంబులెన్స్ డ్రైవ్
రోజా చొరవతో నగరికి రెండు బైక్ అంబులెన్స్‌లు వచ్చాయి. రోజా కోరడంతో శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందజేసింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. తర్వాత బైక్ అంబులెన్స్‌లను నడిపి సందడి చేశారు నగరి ఎమ్మెల్యే. నగరి, పుత్తూరు ప్రభుత్వ దవాఖానాలకు ఒక్కొ బైక్ అంబులెన్స్‌ను అందజేశారు.