విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజు

|
Google Oneindia TeluguNews

అసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని, అలా చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ రోజు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఇక ఇదిలా ఉంటే చాలా మంది టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి నేతలు సైతం మాట్లాడడం టిడిపిని టెన్షన్ పెడుతోంది.

టీడీపీ ఓటమిపాలై మూడు వారాలే .. అప్పుడే 100 చోట్ల దాడులు అని చంద్రబాబు ఆవేదన <br>టీడీపీ ఓటమిపాలై మూడు వారాలే .. అప్పుడే 100 చోట్ల దాడులు అని చంద్రబాబు ఆవేదన

బిజెపి నేత సోము వీర్రాజు ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా అయితే దానిని కేంద్రం పరిశీలిస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారని గుర్తు చేశారు. ఇక ఆయన కోరికలో తప్పేమీ లేదంటూ మాట్లాడారు సోము వీర్రాజు. ఇక అదే సమయంలో గత ఐదేళ్ల కాలంలో బిజెపిని తిట్టడమే టిడిపి తన పనిగా పెట్టుకుందని సోము వీర్రాజు విమర్శించారు. అంతేకాదు టిడిపి పైన నేతల విశ్వాసం పోయిందని బిజెపి నేతలతో చాలా మంది టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీని నాశనం చేయడానికి అన్ని రకాలుగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేశారని సోము వీర్రాజువిమర్శించారు.

Most of the TDP leaders are also in touch with BJP .. Somu Veerraju stated

కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకోవడానికి నడుం బిగించింది అని , అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు సోము వీర్రాజు. రాజకీయ విమర్శలే కాకుండా అధికారులతో కూడ బీజేపీని తిట్టించారని వీర్రాజును ఆరోపించారు. ఇప్పటికే తమతో చాలామంది టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని చెప్పిన సోము వీర్రాజు వారెవరో మాత్రం పేర్లు చెప్పకుండా బాంబు పేల్చారు. మొత్తానికి వైసిపినే కాదు, బిజెపి సైతం చంద్రబాబును టెన్షన్ పెట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు బిజెపి నేతలు .

English summary
BJP leader Somu Veerraju spoke to the media in Amravati today. Somu Veerraju said that the Center will look into the special status of AP people. AP Chief Minister YS Jaganmohan Reddy reminded that the centre should be given special status .At the same time, the TDP has acted as a task to fight the BJP over the past five years. He also said that most TDP leaders are in touch with BJP leaders that the leaders have lost confidence in the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X