విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేని నాని ...బోండా ఉమా హౌస్ అరెస్ట్: ధర్నాలో పాల్గొనకుండా: కొనసాగుతున్న ఆందోళనలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధాని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక సంఘాలు కలిసి అమరావతి పరిరక్షణ సమితిగా ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను విజయవాడలోని నివాసంలో హౌస్ అరెస్ట్ చేసారు. ఇక, అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మండదం ..తుళ్లూరు లో రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు.

 నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..! నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..!

రాజధాని పరిధిలోని రెండు జిల్లాల్లో లాయర్లు విధులు బహిష్కరించారు. బుధవారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు పరిరక్షణ సమితి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగులను ఆందోళన చేస్తన్న వారు అడ్డుకోకుండా పోలీసులు రాజధాని గ్రామాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.

MP Kesineni Nani and Tdp leaders house arrest in vijayawada

ఇప్పటికే మండదం గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు. కొత్త వారు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. అదే విధంగా కీలకమైన కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలోనే జరగనుండి. ఆ సమావేశానికి వచ్చే మంత్రులను స్థానికులు అడ్డుకొనే అవకాశం ఉండటంతో..పోలీసులు ఆ సమయంలో నిరసనలకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇక, కొత్తగా ఏర్పడిన అమరావతి పరిరక్షణ సమితి ఈ నెల 28న రాజధాని రెండు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చింది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా..ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో బోండా ఉమా..బుద్దా వెంకన్నా పాల్గొనకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

అలాగే రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కృష్ణా - గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులకు అమరావతి పరిరక్షణ సమితి నేతలు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇక, రాజధాని ప్రాంతంలోని రైతులు మధ్నాహ్నం గవర్నర్ ను కలవనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి..ప్రదానికి లేఖలు రాసిన రైతులు..

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని సైతం కలిసి రాజధాని తరలించకుండా అడ్డుకోవాలని అభ్యర్ధన చేయగా..ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, ఇప్పటికే రాయలసీమ నుండి సైతం కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తుండటంతో ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TDP MP Kesineni Nani and ex Mla Bonda Uma house arrest in vijayawada.When thy tried to participate in portest against capital shifting police restricted them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X