విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ కేశినేని నానీ వ్యంగ్యం .. జగన్ అండ్ గ్యాంగ్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఏపీలో తాజా పరిణామాల నేపధ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానీ వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు . క్రిస్మస్ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 'ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్ & గ్యాంగ్ వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు.. రాష్ట్రం ఏమి అయినా ఫర్వాలేదు.. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్మస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మూడు రాజధానులపై రగడ కొనసాగుతున్న నేపధ్యంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక పక్క రాజధాని ప్రాంత 29 గ్రామాల రైతులు రాజధాని తరలించవద్దని ఆందోళనలు చేస్తున్నా పట్టింపు లేనట్టు వ్యవహరిస్తుంది వైసీపీ సర్కార్ . ఇక ఈ నేపధ్యంలోనే జగన్ తీరుపై నిప్పులు చెరుగుతున్న ఎంపీ కేశినేని నానీ జగన్ పై, వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక నిన్నటికి నిన్న కేశినేని నాని తన ట్వీట్‌లో 'జగనన్న నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం ఎన్నార్సీకి వ్యతిరేకం అంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న.. హ్యాట్సాఫ్ అన్నా'అంటూ సెటైర్లు వేశారు . నేడు మీరు మాత్రం సంతోషంగా ఉండాలని భగవంతుడ్ని కోరుకోండి అంటూ ఎద్దేవా చేశారు .

MP Kesineni Nani sarcasm on CM Jagan ..Wishes to Jagan and gang On Christmas Eve

ఇక నేడు క్రిస్మస్ పర్వ దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేశినేని నాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మీకు,మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

English summary
TDP MP Kesineni Nani slammed Andhra Pradesh Chief Minister Jagan. On Christmas Eve, he tweeted a post of himself on his Twitter account. "Christmas wishes especially to the Jagan & Gang, YCP party which has left the state and the people in a state of uncertainty
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X