వంశీ, కొడాలి నానీలకు నందమూరి వారసుడి వార్నింగ్ ... మామయ్యనే తిడతారా అంటూ ఫైర్
ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఏపీ మంత్రి కొడాలి నాని అత్యంత అసభ్యకరంగా పరుష పదజాలంతో చంద్రబాబు నాయుడిని తిట్టడం రాష్ట్ర ప్రజలనే కాదు నందమూరి వారసులను సైతం షాక్ కి గురిచేసింది. దీంతో నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ కొడాలి నానికి , వల్లభనేని వంశీ కి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీడీపీలో ఉంటే లాభం లేదు ... వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై జేసీ

వల్లభనేని వంశీ , కొడాలి నానీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చైతన్య కృష్ణ
నిన్న మొన్నటివరకు టీడీపీలో కొనసాగిన వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపించారు. వాడు, వీడు, వెధవ, సన్నాసి అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక కొడాలి నాని కూడా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఓ లుచ్చా అంటూ తీవ్రపదజాలంతో దూషించారు. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నందమూరి వారసుడు చైతన్య కృష్ణ.

వ్యక్తిగత దూషణలు మంచిది కాదని హితవు
ఏది పడితే అది, ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా మాట్లాడటం పద్ధతి కాదని హెచ్చరించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు తమ తీరు మార్చుకోకుంటే ఊరుకునేది లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడిన నందమూరి వారసుడు పార్టీ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణలు మంచిదికాదని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

తీరు మార్చుకోవాలి.. లేకుంటే ఊరుకునేది లేదన్న నందమూరి వారసుడు
కొడాలి నాని ఇప్పుడు మంత్రిగా ఉన్నారు అంటే అందుకు కారణం చంద్రబాబేనని చైతన్య కృష్ణ అన్నారు. గుడివాడ నుండి రెండుసార్లు కొడాలి నాని కి టికెట్ ఇచ్చి రాజకీయాల్లో సముచిత స్థానం ఇచ్చారని, అలాంటి వ్యక్తిని కొడాలి నాని ఇంతగా దుర్భాషలాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇక నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి, గత ఎన్నికల్లో కూడా టిడిపి నుండి గన్నవరం టిక్కెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తన భాషను మార్చు కోవాలని నందమూరి చైతన్య కృష్ణ మండిపడ్డారు .

విధివిధానాల విషయంలో అభ్యంతరాలుంటే రాజకీయంగా విమర్శించుకోండి
నోటికి వచ్చినట్టు దూషిస్తే సహించేవారు ఎవరూ లేరని, ఈసారి తన మామయ్యను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోం అని ఆయన హెచ్చరించారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష తో ఎదిగిన వారు ఇప్పుడు ఆయనను వాడు, వీడు అని అసభ్యంగా మాట్లాడటం పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు విధి విధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే రాజకీయంగా విమర్శించు కోవాలి తప్ప ఇలా బూతులు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా దూషిస్తే ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరూ లేరని వార్నింగ్
వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తేలేదని, చేతులకు గాజులు వేసుకుని ఎవరు కూర్చోలేదని సీరియస్ అయ్యారు నందమూరి చైతన్య కృష్ణ. అంతేకాదు కొడాలి నాని, వల్లభనేని వంశీ లిద్దరూ చంద్రబాబును టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా దూషించడం మానుకోవాలని లేదంటే ఊరుకునేది లేదని నందమూరి వారసుడు చైతన్య కృష్ణ హెచ్చరించాడు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!