విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ మంత్రి నారాయణకు షాక్ .. అనుమతులు లేవని నారాయణ స్కూల్ సీజ్ , లక్ష జరిమానా

|
Google Oneindia TeluguNews

విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాల ప్రారంభం తొలిరోజునే మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థ కు షాక్ తగిలింది. నారాయణ స్కూల్ ను సీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని పాఠశాలలు పై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ సత్యనారాయణపురంలో గుర్తింపు లేకున్నా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలకు చెందిన నారాయణ స్కూల్ ను సీజ్ చేసింది.

ఎంపీ కేశినేని నానీ మరో పోస్టు .. భయం తన రక్తంలో లేదట .. ఎవరికి ఈ తాజా సందేశం ! <br>ఎంపీ కేశినేని నానీ మరో పోస్టు .. భయం తన రక్తంలో లేదట .. ఎవరికి ఈ తాజా సందేశం !

నారాయణ స్కూల్ సీజ్ .. లక్ష రూపాయల జరిమానా

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గుర్తింపు లేని పాఠశాలల ఏరివేతకు చర్యలు చేపట్టింది విద్యాశాఖ. ఇక ఈ నేపథ్యంలోనే విజయవాడ సత్యనారాయణ పురం లో ఉన్న నారాయణ స్కూల్ కు అనుమతులు లేవని గతంలో మూడు దఫాలుగా నోటీసులు జారీ చేసింది విద్యాశాఖ. అయినా వారి వైఖరి మారకుండా తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు విద్యాశాఖ అధికారులు నారాయణ స్కూల్ సీజ్ చేయడంతో పాటుగా, లక్ష రూపాయలు జరిమానా విధించారు.

Narayana school seized and imposed fine of Rs one lakh... Jagans government action

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం జగన్ నిర్ణయం .. రంగంలోకి దిగిన అధికారులు

ఇక విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం తొలి మంత్రివర్గ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ విద్యా శాఖ సంస్కరణల కోసం రెగ్యులేటరీ కమీషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ అమ్మఒడి పథకం ద్వారా చిన్నారుల చదువుకు భరోసా కల్పిస్తామని ప్రకటించిన జగన్ ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలలో ఫీజుల నియంత్రణ కోసం కమిటీలను వేయనున్నారు.

మొత్తానికి పాఠశాలలు ప్రారంభమైన తొలి నాడే మాజీ మంత్రి నారాయణ కు షాక్ ఇస్తూ నారాయణ స్కూల్ ను సీజ్ చేసిన జగన్ సర్కార్ టిడిపి నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రంగంలో ఎవరు ఎలాంటి అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా ఎంతటి వారైనా సరే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇక అనుమతుల్లేని విద్యా సంస్థలకు తొలిరోజు చెమటలు పట్టించింది .

English summary
The academic year began. On the very first day of the school launch, the former Minister Narayana was shocked. The AP government decided to seize Narayan School. The Andhra Pradesh Government, which has taken the decision to swap off on unrecognized schools, has seized Narayana School of Narayana educational institutes, which are not recognized by the government and not taken the permission to run the classes in Vijayawada Satyanarayapuram.The Narayana School in Vijayawada Satyanarayana Puram was issued notices by Education Department for three times. However, education department officials today filed a Narayana school seizure and a fine of Rs one lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X