విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నో ట్విస్టులు: మూడున్నర నెలల పోరు: ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ: కాస్సేపట్లో ఛార్జ్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్నో మలుపులు.. ఊహించని పరిణామాలు.. న్యాయపోరాటాల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఆయన తన పాత స్థానాన్ని భర్తీ చేయనున్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన ఈ పదవిని అధిష్ఠించడం ఇది రెండోసారి అవుతుంది. అయిదేళ్ల ఆయన పదవీ కాలంలో ఇక ఎనిమిది నెలలు మిగిలి ఉన్నాయని తెలుస్తోంది.

Recommended Video

Nimmagadda Ramesh Kumar Case Coming To Hearing On June 10 In Supreme Court

జగన్ లేటుగానైనా..: నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై రఘురామ కీలక వ్యాఖ్యలుజగన్ లేటుగానైనా..: నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై రఘురామ కీలక వ్యాఖ్యలు

అంతిమ విజయం ఆయనదే..

అంతిమ విజయం ఆయనదే..

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ కొద్దిరోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఉద్వాసనకు గురైన ఆయన అనేక మలుపుల తరువాత మళ్లీ అదే స్థానాన్ని అందుకున్నారు. తనను అర్ధాంతరంగా తొలగించడం పట్ల న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. అంతిమంగా విజయం సాధించారు.

 చంద్రబాబు హయాంలో అపాయింట్‌మెంట్..

చంద్రబాబు హయాంలో అపాయింట్‌మెంట్..


రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డను అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు 2016లో చంద్రబాబు సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీర్మానాన్ని అప్పటి గవర్నర్ ఆమోదించడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులు అయ్యారు. నిబంధనల ప్రకారం.. 2018లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగలేదు. వాయిదా వేస్తూ వచ్చారు.

అర్ధాంతరంగా ఉద్వాసన..

అర్ధాంతరంగా ఉద్వాసన..

ఈ ఏడాది మార్చి చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభం కావడంతో ఆరునెలల పాటు వాయిదా వేశారు. దీనితో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. పదవి నుంచి ఉద్వాసన పలికింది. స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో సంస్కరణలను తీసుకొస్తున్నామని పేర్కొంది. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమించింది.

 న్యాయస్థానాల ద్వారా పోరాటం..

న్యాయస్థానాల ద్వారా పోరాటం..


అయిదేళ్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు అనుకూలంగా తీర్చు వెలువరించింది. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ ఆదేశాలను ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం రాలేదు. స్టే ఇవ్వడానికి అంగీకరించలేదు.

గవర్నర్ జోక్యంతో..

గవర్నర్ జోక్యంతో..

అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిమ్మగడ్డ హైకోర్టు సూచనలతో గవర్నర్‌ను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించారు. ఈ ఆదేశాలు వెలువడిన కొద్దిరోజుల వ్యవధిలో దాన్ని అమలు చేసింది ప్రభుత్వం. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీనితో కొద్దిసేపట్లో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.

English summary
After so many twists and turns, retired IAS officer Nimmagadda Ramesh Kumar will be back in the Andhra Pradesh State Election Commissioner (SEC) seat on August 3, almost 115 days after being thrown out by the YS Jaganmohan Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X