విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం : ద‌్వీపం త‌ర‌హాలో అభివృద్ది..

|
Google Oneindia TeluguNews

ఏపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని నీరుకొండ‌లో ఎన్టీఆర్ నిలువెత్తు రూపం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు డిజైన్ల‌తో పాటుగా ఏ విధంగా విగ్ర‌హం ఉండాలి..అదే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాల నే దాని పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 200 ఎక‌రాల్లో 32 మీట‌ర్ల ఎత్తులో ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ద్వీపం మాదిరి త‌యారు చేయాల‌ని..46 నెల‌ల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల‌ని ఏపి సీయం చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు.

ఆక‌ర్ష‌ణీయంగా ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ప్రాజెక్టు..406 కోట్ల ఖ‌ర్చు..

అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన 'డిజైన్స్ అసోసియేట్స్' రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి పరిశీలించారు.

NTR Statue in Amaravathi with 32 mts height : with cost of rs 406 cr...

మొత్తం ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలావరకు విరాళాలుగా సేకరిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్యకూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా నిర్మించాలని సమావేశంలో అత్యధికులు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు.

ఏపి నూత‌న స‌చివాల‌య నిర్మాణ ముహూర్తం 19న : దేశంలోనే అతి పెద్ద నిర్మాణం <br>ఏపి నూత‌న స‌చివాల‌య నిర్మాణ ముహూర్తం 19న : దేశంలోనే అతి పెద్ద నిర్మాణం

కాంక్రీట్ విగ్రహం కంటే ఇది 30 శాతం ఎక్కువ ఖర్చు అవుతుందని, కానీ, దీర్ఘకాలం మన్నికలో ఉంటుందని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవుతుందని, 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే నిర్మిత ప్రాంతానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచ‌నా వేసారు.

చ‌త్ర‌ప‌తి శివాజీ ఎత్తు మించిపోయేలా..

ఎన్టీఆర్ విగ్రహం లోపలిభాగంలో పైవరకు వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. లోపల ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా వాటర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయరును అభివృద్ధి చేస్తారు. ఆడిటోరియమ్, ఫెర్రీ, సెల్ఫీ పాయింట్, కేఫ్, యాంఫీ ధియెటర్, ఆహ్లాదాన్ని అందించే రైలు వంటి సదుపాయాలను ఏర్పాటుచేస్తారు.

అక్కడే స్టార్ హోటల్, షాపింగ్ సెంటర్లు, రెస్టరెంట్, రిసార్టులు నెలకొల్పుతారు. ఇంతవరకు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఎత్తయిన విగ్రహంగా ఉందని, ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహం 253 అడుగుల ఎత్తుతో దాన్ని మించిపోనుందని అధికారులు చెప్పారు. కొండపై ఏర్పాటు చేసే విగ్రహం కనుక ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు వాటికి మించిన ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు. 46 మాసాలలో ప్రాజెక్టు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.

English summary
AP govt decided to construct NTR Mmorial park in capital with cost of rs 406 cr. Govt planning to build this statue area as an Island. Construction time fixed for 46 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X