విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కారు పగ.. పగ.. అంటూ రగలిపోతోంది! ఇదే ఫ్యాక్షనిజం: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును వైసీపీ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కంపెనీల లీజు రద్దు కంటే రాష్ట్రానికి వైసీపీ చేస్తున్న అన్యాయమే ఎక్కువ అని అన్నారు.

జగన్ సర్కారు పగ.. పగ.. అంటూ..

జగన్ సర్కారు పగ.. పగ.. అంటూ..

శుక్రవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జేసీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పగ.. పగ.. పగ.. అంటూ రగిలిపోతోందని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే.. తనకు జరిగినదెంత ప్రశ్నించారు. లీజు ఎందుకు రద్దు చేశారో న్యాయస్థానంలో తేల్చుకుంటానని జేసీ స్పస్టం చేశారు.

దీన్నే ఫ్యాక్షనిజం అంటారు..

దీన్నే ఫ్యాక్షనిజం అంటారు..

ఎవడు మాట వినకపోయినా వాళ్ల మీద జగన్ సర్కారు పగ తీర్చుకుంటుంోందని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఆర్థి మూలాలు దెబ్బతీసి.. వాళ్ల భార్య, పిల్లలు అడుక్కుతుంటే ఈ సర్కారు ఇగో శాంతిస్తుందని అన్నారు. ప్రజలను బాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దీన్నే ఫ్యాక్షనిజం అంటారని జేసీ వ్యాఖ్యానించారు.

జేసీ సిమెంట్ ఫ్యాక్టరీకి ‘సున్నం’ లీజు రద్దు..

జేసీ సిమెంట్ ఫ్యాక్టరీకి ‘సున్నం’ లీజు రద్దు..

కాగా, అనంతపురం జిల్లా యాడికిలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీతో ఉన్న లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుకప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపురాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ తయారీ ఫ్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల గడువు పొడిగిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని ఈ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

అప్పుడు ట్రావెల్స్.. ఇప్పుడు ఫ్యాక్టరీ..

అప్పుడు ట్రావెల్స్.. ఇప్పుడు ఫ్యాక్టరీ..


ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులపై వైసీపీ సర్కారు దృష్టి సారించిన విషయం తెలిసిందే. సరైన అనుమతులు లేవంటూ పలు బస్సు సర్వీసులను సీజ్ చేసింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని ఆర్టీఏ అధికారులు.. జేసీ సోదరులకు చెందిన 8 బస్సులను సీజ్ చేశారు. జేసీ ట్రావెల్స్ తోపాటు నిబంధనలకు వ్యతరేకంగా పలు ట్రావెల్ బస్సులను కూడా అధికారులు సీజ్ చేశారు.

English summary
Only revenge: jc diwakar reddy slams ys jagan's government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X