• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..!పవన్ క్యారెక్టర్ తో వర్మ చెలగాటం..!తేడా వస్తే అంతే అంటున్న సైనికులు..!!

|

హైదరాబాద్ : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రాంగోపాల్ వర్మ విభిన్న దర్శకుడు. అండర్ వల్డ్ మాఫియా సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపాలన్నా, ఫాక్షన్ కక్షలను కసి దీరా తెరకెక్కించాలన్నా, వీధి రౌడీల మర్డర్లను రోమాలు నిక్కబొడుచుకునేలా చిత్రీకరించలన్నా, ఆడదాని అందాలను కైపెక్కేట్టు విర్ణించాలన్నా వర్మ తర్వాతే ఎవరైనా..! ఇలాంటి వైవిద్య దర్శకుడు తెలుగు వెండి తెరపైన రాజకీయాలకు, నేతల జీవితాలకు ముడిపెడుతూ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..! కులం ఆధారిత సినిమాకు వర్మ రాజకీయ మేకప్..!!

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..! కులం ఆధారిత సినిమాకు వర్మ రాజకీయ మేకప్..!!

ఒక రంకంగా చెప్పాలంటే వర్మ మానవ జాతికి చెందినవాడు కాకుండా సినిమా అనే నూతన జాతికి చెందిన ఓ విచిత్ర జీవి అని చెప్పొచ్చు. వెండి తెర మీద వినోదానికి బదులు రకరకాల వికృత వింత సన్నివేశాలను జనాలపై రుద్దుతూ, దానకి నూతన ట్రెండ్ అంటూ కొత్త కొత్తగా టీవీషోలలో మాట్లాడటం కూడా ఆయన తర్వాతే ఎవరైనా..! పరిశ్రమలో ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న వర్మ తాజాగా రాజకీయ నేపథ్యంలో ఓ సినిమాకు రూపకన్పన చేస్తున్నారు. ఏపి రాకీయాల నేపథ్యంలో ఓ కులం ఆధారిత చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు వర్మ.

వర్మ కొత్త సినిమా..! పవన్ పాత్రపై నెలకొన్న ఉత్కంఠ..!!

వర్మ కొత్త సినిమా..! పవన్ పాత్రపై నెలకొన్న ఉత్కంఠ..!!

ఐతే వర్మని తన సినిమాల పట్ల వివరణ అడగాలన్నా సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు జంకిపోతుంటారు. అతన్ని ఎదుర్కోవడానికి మహిళా సంఘాలు కూడా భయపడతాయి. వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన జీఎస్టీ అంశంలో చాలా మంది మహిళ సంఘాలు వర్మ చేసింది తప్పు అని చెప్పే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంత మంది మహిళలు అవమానం పాలై పోలీసు స్టేషన్లో కేసులను కూడా నమోదు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లె అంతటి ఘన చరిత్ర ఉన్న వర్మ తాజాగా ఆంద్ర ప్రదేశ్ రాజకీయాలను, ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నేతలకు ముడి పెడుతూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా చూపించినట్టు చర్చ జరుగుతోంది.

పవన్ ను అపహాస్యం చేస్తే సహించం..! హెచ్చరిస్తున్న ఫాన్స్..!!

పవన్ ను అపహాస్యం చేస్తే సహించం..! హెచ్చరిస్తున్న ఫాన్స్..!!

ఎందుకో ఇటీవల జగన్ అభిమానిగా మారిపోయిన రాంగోపాల్ వర్మ, మొన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీసి సంచలనంగా మారారు. సినిమా హిట్టుతో అతనికి అవసరం లేదు. జస్ట్ మీడియాలో తాను నిత్యం ఉండడానికి పనికొచ్చే ఒక సినిమా సబ్జెక్ట్ మాత్రమే వర్మకి కావాలి. ఎన్నికల ఫలితాలు వచ్చాక, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే గుంటూరు కృష్ణా జిల్లాలలో రాజధాని ఉండటం, రెడ్డి సామాజిక వర్గమైన జగన్ ముఖ్యమంత్రి కావడంతో మరో కాంట్రవర్సీ సినిమాకు వర్మ తెరతీశారు. పైగా ఇది నాన్ కాంట్రవర్సియల్ సినిమా అంటూ ప్రమోషన్ చేస్తూ సెటైర్ వేస్తున్నాడు వర్మ. ఇక ఇందులో చంద్రబాబు, పవన్, జగన క్యారెక్టర్లు ఉంటాయనడంలో అనుమానం లేదు.

ఆర్జీవీ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు..! పూటకో పిక్ విడుదల చేస్తున్న వర్మ..!!

ఆర్జీవీ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు..! పూటకో పిక్ విడుదల చేస్తున్న వర్మ..!!

అయితే పవన్ కళ్యాణ్ పాత్రను తీర్చిదిద్దిన తీరు పలు సందేహాలను కలిగిస్తోందంటున్నారు జనసైనికులు. పవన్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురిచేసేలా ఉంటే మాత్రం పరిణామలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలను గబ్బర్ సింగ్ అభిమానులు వర్మకు చేరవేస్తున్నారు. పవన్ పొలిటికల్ ప్రసంగం చేస్తుంటే, నలుగురు అందమైన అమ్మాయిలు స్టేజిమీద హడావుడి చేస్తున్నట్లు కనిపించే ఒక స్టిల్ తాజాగా విడుదల చేసారు వర్మ. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సాయంత్రం లోకేష్ క్యారెక్టరుతో మాట్లాడుతున్న పవన్ పాత్రలోని స్టిల్ ఒకటి మీడియాకు విడుదల చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ, జగన్ అభిమానాన్ని పొందడానికి ఆర్జీవీ సిద్ధమయితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసైనికులు చెప్పుకొస్తున్నారు.

English summary
The role played Pawan Kalyan in Varma's latest film is a lot of doubts. Pawan fans are warning Varma if anything negetive over Pavan, consequences will be severe. As Pawan's political speech, Varma has released a still that looks like the four beautiful girls are on the stage. Fans are angry with this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X