• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి నిప్పులు: నా తాట నువ్వు తీసేదేంది.. ప్రజలే నీతాట తీస్తారు

|

10ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉండి అప్పుడు గుర్తు లేని బాధ్యతలు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అంటూ నటి శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ను దుమ్మెత్తి పోసిన వీడియో వైరల్ అయ్యింది.

చిరంజీవి ఎంత డబ్బులు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలి

చిరంజీవి ఎంత డబ్బులు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలి

జగన్ 30 ఏళ్లు అధికారంలో ఉంటానని చెప్పడాన్ని పదేపదే ప్రస్తావిస్తున్న పవన్ కళ్యాణ్... జనాలు ఆదరించకుంటే జగన్ అధికారంలో ఉండలేరని శ్రీరెడ్డి అన్నారు. మాట్లాడితే జగన్ అవినీతికి పాల్పడ్డాడని విమర్శిస్తున్న పవన్... కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం చేయడానికి చిరంజీవి ఎంత డబ్బులు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు. అది మాట్లాడే దమ్ము లేని పవన్... నిరూపితం కాని జగన్ కేసులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిరంజీవి చేతకాక పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారని దానిపై పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు శ్రీరెడ్డి.

 నాడు చిరంజీవి పార్టీ మూసేస్తే నువ్వెందుకు కొత్త పార్టీ పెట్టావు..?

నాడు చిరంజీవి పార్టీ మూసేస్తే నువ్వెందుకు కొత్త పార్టీ పెట్టావు..?

ఎప్పుడూ చంద్రబాబు ఆయన కుటుంబానికి చెందినవారే వస్తారా అని పవన్ అంటున్నారని... మరి ఆరోజు ప్రజారాజ్యం పార్టీని పవన్ అన్నయ్య చిరంజీవి నడపలేక పార్టీని తీసుకెళ్లి మరో పార్టీలో కలిపేస్తే ... ఇప్పుడు నువ్వెందుకు రాజకీయాల్లోకి వచ్చావని పవన్‌ను శ్రీరెడ్డి ప్రశ్నించారు. పవన్ ప్రజలకు ఒక చిరంజీవి తమ్ముడిగానే తెలుసునని చెప్పిన శ్రీరెడ్డి.... ఒకటో రెండో సినిమాలు హిట్టు కొట్టాడని అంతకు మించి పవన్ గురించి పెద్దగా చెప్పుకునేందుకు ఏమి లేదని ధ్వజమెత్తారు. కార్పొరేటర్‌గా కూడా పోటీ చేయని పవన్... ప్రజలతో సీఎం సీఎం అని సభల్లో అనిపించుకుంటున్నాడని ఆమె వెల్లడించారు.

పదేళ్లుగా గుర్తుకు రాని ప్రజాసమస్యలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా

పదేళ్లుగా గుర్తుకు రాని ప్రజాసమస్యలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా

ఇన్ని రోజులు లేని బాధ్యత పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడే గుర్తొంచ్చిందా అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అంతమంది విద్యార్థులు చనిపోతే నాడు మాట్లాడని పవన్ ఇప్పుడు కొత్తగా బాధ్యతల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడావా అని ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా బాధ్యత అంటే ఏమిటో గుర్తు వచ్చిందా అని శ్రీరెడ్డి అన్నారు. ఇంతకాలం చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులు కోట్లు సంపాదించడం మీదే దృష్టి సారించారని చెప్పిన శ్రీరెడ్డి కొత్తగా బాధ్యతల గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవన్ ఏ ఒక్కరోజు ప్రజాసమస్యలపై గళం విప్పలేదని గతేడాదిగా ప్రజా సమస్యలంటూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు శ్రీరెడ్డి. గత ఏడు ఎనిమిది నెలలుగానే పవన్ ప్రజాసమస్యలపై మాట్లాడుతున్నారని అంటే అతనికి కూడా సీఎం కావాలన్న అధికార దాహం ఉందని చెప్పిన శ్రీరెడ్డి ఇతరులు కూడా సీఎం కావాలనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది.

ఒకప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు ఇతర ఉన్నతాధికారులు చిరంజీవి వెనక నిలిచారని ఇప్పుడు స్తబ్దుగా ఉన్నారని పవన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించినట్లు చెప్పిన శ్రీరెడ్డి... చిరంజీవి ఏ రకంగా అయితే పార్టీని విలీనం చేసి వారికి అన్యాయం చేశాకో అది దగ్గరనుంచి చూశారని... మళ్లీ పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని ఆ సాహసం చేయలేమని ఆ అధికారులంతా భావిస్తున్నారని శ్రీరెడ్డి వివరించారు.

 నాదెండ్ల భాస్కరరావు శృతిమించి మాట్లాడటం సరికాదు

నాదెండ్ల భాస్కరరావు శృతిమించి మాట్లాడటం సరికాదు


ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుపై నిప్పులు చెరిగారు శ్రీరెడ్డి. అసలు నాదెండ్ల భాస్కర రావు వయస్సు మీద పడింది కానీ ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. ఈ మధ్య కాలంలో నాదెండ్ల భాస్కరరావు పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించారు. యువత, చిన్న పిల్లలు చూస్తారన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా పెద్దాయన బూతులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల భాస్కర్ రావు ఇద్దరూ స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఎంతమంది నాదెండ్ల భాస్కర్ రావులను తీసుకొచ్చి మాట్లాడిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో మంచి పదవులు అలంకరించిన నాదెండ్ల భాస్కరరావు... లేని ఎన్టీఆర్‌లాంటి మహానుభావుడిని ఉద్దేశించి మాట్లాడటం ఆయన వయస్సుకు సరికాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలన్నా, అభివృద్ధి దిశగా పయనించాలన్నా.. ఎన్నో సంస్కరణలు తీసుకురావాలన్న అంతో ఇంతో చదువుకున్న పవన్ కళ్యాణ్ చేత అవుతుందని తాము అనుకోవడం లేదని శ్రీరెడ్డి అన్నారు. ఒక ముసలాడిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ నీచరాజకీయాలు చేస్తున్నారని శ్రీరెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటివి చేస్తే పవన్ కళ్యాణ్‌కు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని ఆమె అభిప్రయాపడ్డారు. తన తాట తీస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు కానీ... ప్రజలే ఆయన తాట తీసే రోజులు దగ్గరలో ఉన్నాయని శ్రీరెడ్డి హెచ్చరించారు.

English summary
Actress sri Reddy once again turned guns at Janasena Chief Pawan Kalyan.She said that Pawan has no qualifications to become a Chief Minister of a state. Pawan will also close his party like his brother Chiranjeevi did, said the actress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X