విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు రాజధానులపై రేపు జనసేన కీలక భేటీ- భవిష్యత్ కార్యాచరణ ఖరారు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ రేపు అమరావతిలో కీలక భేటీ నిర్వహించబోతోంది. రేపు పార్టీకి చెందిన కీలక నేతలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. గుంటూరు సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద నున్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు ఉదయం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి అమరావతి రైతులకు ఎలా అండగా నిలవాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారు.

మిత్రపక్షం బీజేపీ అమరావతి విషయంలో పిల్లిమొగ్గలు వేస్తున్న తరుణంలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ కోసం ఏర్పాటు చేసిన పీఏసీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అమరావతిని రాజధానిగా ఉంచాలని గతంలో తాము రాజకీయ తీర్మానం చేశామని చెబుతున్న బీజేపీ రాష్ట్ర నేతలు..

pawan kalyan calls for pac meeting tomrrow to decide future action on three capitals

Recommended Video

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu

రాజధాని తరలింపు విషయంలో మాత్రం కేంద్రం జోక్యం ఉండబోదని చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అంశంలో కేంద్రం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మూడు రాజధానుల విషయంలో బీజేపీ స్టాండ్ కు అనుగుణంగా జనసేన నిర్ణయం తీసుకుంటుందా లేక అమరావతి రైతుల కోసం ఉద్యమం చేపడుతుందా అన్న విషయంలో జనసేన అధిష్టానం రేపు ఓ ప్రకటన చేయనుంది.

English summary
janasena party political affairs committee to meet tomorrow in amaravathi to decide future course of action on three capitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X