విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పెట్టుకోండి: ప్రాణాలు పోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: భారీగా పెరిగిన ఉల్లి ధరలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఉల్లిగడ్డలను కూడా సబ్సిడీలో సరిగా అందించలేని స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలుమీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలు

జగన్ సర్కారు విఫలం

జగన్ సర్కారు విఫలం

‘ఉల్లి కోసం లైన్లలో నిలబడిన ప్రజల గురించి ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రచురించిన ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన జనసేనాని వైసీపీ ప్రభుత్వం, ప్రజల నిత్యావసరాల విషయాలలో చాలా ఘోరంగా విఫలమైంది అంటానికి తార్కాణం ఇదే' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అసమర్థ విధానంలో అద్దంపడుతోందీ ఘటన

అసమర్థ విధానంలో అద్దంపడుతోందీ ఘటన

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు. కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా.. అని దాని రేటు పెంచేశారు అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఉల్లి కొనడానికి క్యూ లో నిలబడి అస్వస్థత కారణంగా చనిపోయిన సాంబి రెడ్డి గారి మృతి పట్ల జనసేనాని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జగన్ గారి అసమర్ధ పరిపాలన విధానాలకు అద్దంపడుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

మంత్రి నాని నియోజకవర్గంలోనే..

మంత్రి నాని నియోజకవర్గంలోనే..


‘ఉల్లిపాయల కోసం రైతు బజార్ వద్ద లైన్లో నిలబడి తొక్కిసలాటలో కిందపడి ప్రాణాలు కోల్పోయిన సాంబిరెడ్డి విషాదాంతం మనసును కలిచివేసింది. పౌరసరషరాల శాఖ మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి సాంబిరెడ్డి విషాద ఉదంతోనైనా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ప్రజలు ఉల్లిపాయల కోసం గంటల కొద్దీ క్యూలలో నిలబడవలసి రావడం ఈ ప్రభుత్వ చేతకానితనాన్ని తెలియజేస్తోంది. వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాల విషయంలో ఘోరంగా విఫలమైందనడానికి రైతు బజార్ల వద్ద దర్శనమిచ్చే క్యూలైన్లే నిదర్శనం' అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

జగనన్న ఉల్లిపాయల పథకం అని..

జగనన్న ఉల్లిపాయల పథకం అని..

కిలో ఉల్లి 25 రూపాయలకు ఇంటింటికీ వెళ్లి గ్రామ వాలంటీర్ల చేత ఈ ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయించట్లేదు అని ప్రశ్నించారు? ఆలా చేయడం వల్ల ప్రజలు ఉల్లి కోసం లైన్లలో నిలబడనవసరం లేదని అన్నారు. ఇలా చేసి ఒకవేళ మీకు కావాలంటే ఈ పథకానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకం అని పెట్టుకోండి అని పవన్ కళ్యాణ్ చురకలంటించారు.

పవన్ కళ్యాణ్ దీక్షకు తరలండి

పవన్ కళ్యాణ్ దీక్షకు తరలండి

రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారికి అండగా నిలబడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు బాసటగా నిలిచేందుకు డిసెంబర్ 12న ఉదయం 8గంటలకు కాకినాడలో పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేయనున్నారని తెలిపారు.

English summary
Janasena Party president Pawan Kalyan fires at CM ys jagan govt for onions price issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X